రసము జీవితసారము


Mon,July 15, 2019 01:40 AM

మానవ జీవితంలో గాఢమైన వ్యక్తిగతమైన అనుభవాలు దేశకాల పరిమితులను దాటినపుడు అవి రసమయమవుతాయి. ఈ రసము కావ్యాలలో నాటకాలలో నృత్యాదులలో అందరికి తమ అనుభవంగానే గోచరిస్తుంది. అయితే లౌకిక పరిమితులను దాటి ఈశ్వర భావంతో సంవదించినపుడు తనకు తెలిసీతెలియని భావనగా ప్రకటితమైనపుడు అది భక్తి అవుతుంది. లోకంలో తన పరిధలో జీవించే మానవుడు జగత్తునకు కారణమైన భగవత్ భావనతో తననుతాను కలుపుకొన్నప్పుడు అది లోక రసమును దాటి భక్తి రసమవుతుంది. రసవాదులు ఈ భక్తి లోకాతీతం కావటం వల్ల రసంగా అంగీకరించలేదు.

భక్తి రసానికి ప్రత్యేకమైన లక్ష్య గ్రంథము ఏదీ లేదు. చైత న్య మహాప్రభువు కాలంలో రూపగోస్వామి మొదలైన వారు భక్తిని రసముగా స్థాపించే ప్రయత్నం చేశారు. సంస్కృత పురాణాలలో భాగవతం భక్తి భావాన్ని వెయ్యి రేకులతో వికసించిన పద్మం లాగా తీర్చిదిద్దింది వేద వ్యాసుడు. వేద వ్యాసుడు వేదములను విభజించి, పురాణములను రచించి మహాభారతమును నిర్మించినవాడు. ఎంతటి జ్ఞాని అయినా ఒక అసంతృప్తి, ఏదో కొరత కనిపించేది. మాధుర్యం జీవితంలో పొంగులెత్తేది కాదు. అలాంటి క్లిష్ట సన్నివేశంలో మహర్షులకే గురువైన నారదుడు వచ్చి వేద వ్యాసుడిని పరామర్శించాడు. నీవు రచించిన ఇంతటి గ్రంథ రాశిలో ఎక్కడ కూడా విష్ణు భక్తి, నారాయణ కథ, కథనము అ భక్తి భావనలలో కరిగిపోవటం వంటిది నీవు చేయలేదు. ఇప్పుడు నీవు చేయవలసింది భగవంతుడి గురించి ఆయన భక్తులను గురిం చి ఆయన అవతారం, లీల, మహిమల గురించి విశదంగా ఒక గ్రంథం రచించాలి. ఆ గ్రంథము భగవత్ అనుభవసారము కావటం వలన భాగవతం అవుతుంది. ఈ పని చేయడం వల నా నీ జన్మ ధన్యమవుతుంది అని గురువైన నారదుడు చెప్ప గా.. వేద వ్యాసుడు ఆయన మాటను శిరసావహించి భాగవతాన్ని నిర్మించాడు. భాగవతం విష్ణు మంత్రాలలో శ్రేష్ఠమైన ద్వాదశాక్షరి వ్యాఖ్యాన రూపం. భాగవతం శాపాన్ని పొందిన పరీక్షిత్ మహారాజు బ్రతికే ఏడు రోజులలో ఏలు ముక్తి పొందవలెను అని ఆలోచించే జీవన్ముకుడైన శుక బ్రహ్మ వలన ఉపదేశం పొందాడు.

పోతన రచన వేళలో అంతర్ ముఖుడవుతాడు. శబ్దాలు ఒకదానివెంట ఒకటి నేనంటే.. నేనంటు పరిగెత్తుకు వస్తాయి. నాధ సౌభాగ్యం తనకుతాను వింటూ పద్యమైనా, గద్యమైనా సమకూరుస్తాడు. ఆయన వాడే ప్రసాలు మృదంగంలాగా మ్రోగిస్తాయి. అందువల్లనే అందరి పద్యాలకంటే ఆయన పద్యాలు అంటే తెలుగువారికి ఇష్టము.


ఈ మహాగ్రంధాన్ని తెలుగు వారందరి పుణ్యం పోతన తెలుగులోనికి పునః సృష్టి చేశాడు. పోతన భాగవతం మొత్తం భారతదేశంలో దేశ భాషలలోనికి అనువదింపబడిన తొలి గ్రంథం. తెలుగు భాష సాహిత్యంలో పొతన భాగవతమంత లోక ప్రాయమైన గ్రంధము లేదు. భాగవత పద్యం భక్తి భావ రసముతో నిండ న రసాల ఫలము. మిగిలిన తెలుగు కవులలో పోతనకు ఉండే భేదము ఆయన రచన పాఠకునికి తన్మయి భావన కలిగిస్తుం ది. ఆయన రచన సందర్భంలో తానను తాను తొలిగించుకొని కావ్య భూమికలలో సంచరిస్తాడు. నన్నయ్య, తిక్కన్న మొదలైన పూర్వ కవులు ఎన్ని పురాణాలు రచించిన భాగవతాన్ని ముట్టుకోకుండా తన కోసం వదిలి పెట్టినారని భావిస్తాడు. తన రచనను ఏ రాజులకు అంకితం చేయకుడా తానను భాగవతా న్ని రచింపమని చెప్పిన గోదావరి తీరంలో దర్శనమిచ్చి ఆదేశించిన శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఆయన రచన చేసినప్పుడు తన వ్యక్తిత్వాన్ని ప్రకటించిలేదు. పలికేడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట అని తన ఆత్మ జ్ఞాన రూపమైన శరణాగతి ప్రకటించాడు. భాగవతాన్ని శ్రీరామునికి అంకితం చేస్తూనే, శ్రీకృష్ణుని స్తుతిస్తూనే షష్ఠ్యాంతా లు రచించాడు. ఈ విధంగా రామకృష్ణుల ఆభేదాన్ని స్థాపించాడు. భాగవత ఆరంభం నారాయణుని ఇరువైయొక్క అవతారాలను వర్ణించడంతో సాగుతుంది. భాగవతంలో అనేక గాథల లో రాక్షసులు, విష్ణు విరోధులు ఎక్కువమంది కనిపిస్తారు. వాళ్లలో చాలామంది నారాయణుని నిందించినట్లు కనిపించే భాషలో పోతన ఒక చమత్కారాన్ని గర్భితం చేస్తాడు. ఆ మాటలను విప్పిచూస్తే నిందలుగా కాకుండా భగవంతుని తత్వమెరిగి పలికినట్లు ఉంటుంది. ఈ విశేషమైన రచన విధా నం సర్వజీవులలో అంతర్యామి ఉన్న దివ్య జ్ఞానాన్ని ప్రకటిస్తుంది.

పోతన రచననలో వెయ్యి విధాలైన కవితా శిల్పం వ్యాపించి ఉంటే ఇది ఒక రీతి. భాగవతంలో భీష్ముడు చేసిన స్తోత్రం, కుంతీదేవీ చేసిన స్తోత్రం ఇప్పటికీ నిత్య పఠనీయాలుగానే ఉన్నవి. అష్టమ స్కందంలో గజేంద్రుడు పొందిన ఆర్తి సాధకులు, భక్తులు నిరంతరం మనం చేసుకోవాల్సిన అంశా లు. సప్తమ స్కందంలో ప్రహ్లాదచరిత్ర లోకంలో ఆవిశ్వాసి, విశ్వాసి మధ్య జరిగిన సంఘర్షణ సర్వకాలీనమైనది. ప్రహ్లాదుని పాత్ర చిత్రణలో జీవితంలో ప్రతీ క్షణం ఈశ్వర భావన తో గడిపే ముక్తజీవుడు కనిపిస్తాడు. ఈ కథలో నరసింహస్వా మి స్తంభం నుంచి ఆవిర్భవించిన సన్నివేశం మనకు ఒక అద్భుతాన్ని కలిపిస్తుంది. ఈ గద్యము చదువుతుంటే ఆ క్షణంలోనే మనకు చైతన్యం ప్రవేశిస్తుంది. మా చిన్నతనంలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ గద్యాన్ని ప్రభావంతముగా చదివి వినిపించడం నాకు ఇప్పటికీ గుర్తు. వామన అవతార ఘటనలో ముల్లోకాలను ఆవరించిన వర్ణన సందర్భంలో రవిబింబము ఉపమింప అన్న పద్యం ప్రపంచ సాహిత్యములోనే మణి దీప ము వంటిది. తొమ్మిదో స్కందంలోని శ్రీరామ చంద్రుని కథ సంగ్రహముగానే ఉన్నా మహిమాన్వితమైనది. దశమ స్కందము మొత్తము శ్రీకృష్ణ లీలల చరిత్రమే. ఒక శిల్ప మహితమైన ఎర్లోరా గుహవలే, మీనాక్షీ దేవాలయం వలే మనసు మొత్తం ఆకట్టుకొనే మహాకావ్యం. రస కల్పవృక్షము. ఈ స్కందములో లక్ష్మీనారాయణ ఏకత్రా సమావేశము పరిచే ఘట్టము రుక్మిణీ కల్యాణం. దీనిలో శ్రీకృష్ణునకు పంపి న సందేశం, అగ్నిధ్యాతనుడు నిర్వహించిన సందర్భం జీవేశ్వరులను, ఆచార్యులను అనుసంధానించే ప్రయత్నం.

పోతన రుక్మిణీ కల్యాణం కథలో బాల త్రిపుర సుందరి సాధనను రహ స్య విద్యగా నిక్షేపించినట్లు విమర్శకులు భావిస్తున్నారు. పోతన రచన వేళలో అంతర్ ముఖుడవుతాడు. శబ్దాలు ఒకదానివెంట ఒకటి నేనంటే.. నేనంటు పరిగెత్తుకు వస్తాయి. నాధ సౌభాగ్యం తనకుతాను వింటూ పద్యమైనా, గద్యమైనా సమకూరుస్తాడు. ఆయన వాడే ప్రసాలు మృదంగంలాగా మ్రోగిస్తాయి. అందువల్లనే అందరి పద్యాలకంటే ఆయన పద్యాలు అంటే తెలుగువారికి ఇష్టము. లోకంలో ఆయన వ్యక్తి త్వం చుట్టూ ఒక మహిమల వలయం వ్యాపించి ఉంటుంది. ఎన్నో అద్భుతాలు, దివ్య జీవనానుబంధాలు ఈనాటికీ సజీవంగా ఉన్నాయి. భగవంతుని చేరేందుకు సులభమైన పద్యాల మార్గాన్ని నిర్మించిన మహాపురుషుడు, పోతన తెలుగుల పుణ్య పేఠి.
- కోవెల సుప్రసన్నాచార్య

128
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles