వెల్లివిరిసిన సామరస్యం


Mon,July 1, 2019 12:29 AM

క్రీ.శ. తొలి వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత ఆదిశంకరులు స్థాపించిన సర్వదేవతా సమభావన క్రమంగా వెనక్కి తగ్గుతూ వచ్చింది. తమిళదేశంలో చోళరాజులు శైవపరమ్యా న్ని స్థాపిస్తూ ఇతర ధర్మాలను తిరస్కరించే ప్రయత్నం చేశా రు. కానీ తెలుగుప్రాంతంలో అలాంటి పరిస్థితి లేదు. వేములవాడ ప్రాంతంలో, హనుమకొండలో జైన మతం క్రమం గా క్షీణిస్తూ వచ్చింది. అంతకుముందు ప్రహతంగా ఉన్న త్రిపురుషారాధనం స్థానంలో శివకేశవులు ప్రాధాన్యం వహించారు. వారితోపాటు స్త్రీ దేవతలందరికీ ప్రతీకగా అమ్మవారు పూజింపబడుతూ వచ్చింది. ఈ ముగ్గురితో పాటు సూర్యునికి, గణపతికి ఉచితమైన స్థానం లభించింది. సాధారణ హిందూ ప్రజలు భేద బుద్ధి లేకుండా ఈ ఐదుగురిని పంచయాతనంగా అర్చిస్తూ వచ్చారు. ఈ పంచయాతన పద్ధతి వల్ల సమాజంలో ఒక సామరస్య ధోరణి వ్యాపిస్తూ వచ్చింది. వీరశైవం తెచ్చిన బసవేశ్వరుని ఉగ్రత కాని, దక్షిణ దేశంలో చోళరాజులు అనుసరించిన పరమత అసహనం కాని తెలు గు ప్రాంతంలో కనిపించలేదు. 12వ శతాబ్దం ఆరంభంలోనే రుద్రదేవమహారాజు హనుమకొండలో త్రికూటాలయాన్ని నిర్మించారు. దీనిలో రుద్రేశ్వరుడు, వాసుదేవు డు, సూర్యదేవుడు ముగ్గురు ముఖ్యమూర్తులుగా ఉన్నా రు.

తెలంగాణలోని త్రికూటాలయాలు వివిధ సంప్రదాయాల మధ్య అన్యోన్య సామరస్యాన్ని వెల్లడిస్తున్నాయి. కరీంనగర్ నగర సమీపంలోని నగునూరులో మరొక త్రికూటాలయం వెలుగుచూసింది. దీన్ని పునర్నిర్మిస్తున్నారు. నలభై సంవత్సరాలముందు నేను, మా గురువు గారు దెందుకూరి సోమేశ్వరరావు గారు రోడ్డు మీది ఆలయాన్ని చూసి ఊరిని చూస్తూ చివరిదాకా వెళ్లాం.


ఒక్కొక్క ఆల యం వెనుక భాగంలో ఆయా దేవతల లీల విభవమూర్తులు మూడువైపుల చెక్కబడి ఉన్నాయి. రుద్రేశ్వరాలయ ద్వారతో రణం మీద తాండవం చేస్తున్న శివుడు, వాసుదేవాలయ ద్వారతోరణం మీద తాండవం చేస్తున్న నరసింహమూర్తి ఉం టుంది. సూర్యదేవాలయం ద్వారతోరణం మీద తాండవం చేస్తున్న ఇంద్రుని మూర్తి చెక్కబడి ఉన్నా యి. ప్రధాన మం టపంలో ఎన్నో అద్భుతమైన శిల్పాలను దర్శించవచ్చు. రుద్రేశ్వర ఆలయ శాసనంలో తొలి శ్లోకంలో కాకతీయుల రాజలాంఛనమైన వరాహమూర్తిని వర్ణించారు. ఆ కాలంలో అనేక రహస్య యోగ సాధనలు చేయబడుతూ ఉండేవి. పాశుపత, కాపాలిక మొదలైన మార్గాలు వ్యాప్తిలో ఉండేవి. ఇప్పుడు చూడలేం కానీ సుమారు ఇరువై సంవత్సరాల ముందు పునర్నిర్మాణం కోసం తొలిగించిన కళ్యాణ మంట పం ఇంకా పూర్తికాలేదు. దీనిలో ఒక మూలకు చిన్న స్తంభాలతో నిర్మించిన మంటపభాగం ఉండేది. దానిలో ఒక స్తం భం మీద ఒక అందమైన శిల్పం కానవచ్చేది. జఠ సమూ హం పెంచుకున్న సాధకుడు ఒకవైపు, అతనికి భక్తితో ఒక బుట్టలో ఫలాలను అందిస్తున్న ఒక గణిక కనిపిస్తుంది. అయితే వీరిద్దరి కాళ్ల మధ్య ఒక కోతి, పండ్ల బుట్టపైన ఒక రామచిలుక చెక్కబడినాయి. ఈ చిత్రం ఆ సాధకుని తపోభంగాన్ని సూచించే కామాన్ని కోతి శిల్పం వల్ల తెలియజేస్తుం ది.

అట్లాగే రామచిలుక తనలో కలిగిన ప్రేమ భావాన్ని వ్యక్తీకరిస్తుందని మనం భావించవలసి ఉంటుంది.ఈ కథ మనం శిల్పాన్ని చూసి భావించేదే. కానీ ఏ సారూప్యత సాక్ష్యం లేదు. శిల్పి వ్యక్తిగతమైన ఎరుక కావచ్చు. క్రీ.శ.1208 ప్రాంతంలో నిర్మించబడినది రామప్ప దేవాలయం. నేటికీ అడవిగా ఉన్న ఆ ప్రాంతం 800 ఏండ్ల కింద ట కీకారణ్యంలో ఉండి ఉంటుంది. ఈ ఆలయ ఉనికిని బట్టి శిల్పాలను బట్టి ఒకనాట్య విద్యాలయం గాను, యోగ విద్యాలయం గాను, రహస్య సాధన స్థలంగా ఆరోజుల్లో తీర్చిదిద్దబడి ఉంటుందని అర్థం అవుతుంది. ఇక్కడి శిల్పాలను బట్టి నటరాజ రామకృష్ణ గారు నూతన నాట్య పద్ధతి కనిపెట్టి ప్రచారంలోకి తెచ్చారు. అయితే ఇంకా అర్థం కావలసిన విషయాలు కోష్ఠ శిల్పాలు మదనికలు ఉన్నాయి. వీటిని కేవ లం సుందర స్త్రీల శిల్పాలుగానే చూస్తున్నాం. కానీ వాటి వెనుక ఉన్న రహస్యాలను మనం కనిపెట్టే ప్రయత్నం చేయ టం లేదు. ఒక సుందరి పాదాల కింద పడగ విప్పిన సర్ప శిల్పం ఉన్నది. మరొక సుందరి పాదాల కింద ఆమె కొంగు పట్టి లాగుతున్న కోతి శిల్పం ఉన్నది. ఈ కోతి శివానంద లహరిలో శంకరులు చెప్పిన చిత్రకపి కావచ్చు.

అట్లాగే పడ గ విప్పిన సర్ప శిల్పం కుండలినీ శక్తికి సంకేతము కావ చ్చు. ఇలా మదనికల శిల్పాలు నిశితంగా పరిశీలిస్తే ఏదో ఒక రహ స్య సాధన విద్యకు ఈ కోష్ఠ ప్రతిమలు సూచిస్తున్నాయేమో అని సందేహం కలుగుతున్నది. సుమారు అరువై సంవత్సరాల కిందట వరంగల్ బట్టల బజారులో కాకతీయు ల నాటి వాగ్దేవతా విగ్రహం బయటపడింది. హనుమకొండ నయీంనగర్‌లో సగానికి విరిగిన రంగనాథస్వామి విగ్ర హం, దగ్గరలోనే అన్నపూర్ణాదేవి విగ్రహం లభించాయి. తెలంగాణలోని త్రికూటాలయాలు వివిధ సంప్రదాయాల మధ్య అన్యోన్య సామరస్యాన్ని వెల్లడిస్తున్నాయి. కరీంనగర్ నగర సమీపంలోని నగునూరులో మరొక త్రికూటాలయం వెలుగుచూసింది. దీన్ని పునర్నిర్మిస్తున్నారు. నలభై సంవత్సరాలముందు నేను, మా గురువు గారు దెందుకూరి సోమేశ్వరరావు గారు రోడ్డు మీది ఆలయాన్ని చూసి ఊరిని చూస్తూ చివరిదాకా వెళ్లాం. దారిలో ఒక ఇంటి పునాదిలో శాసన శిల కనిపించింది. అది ఇప్పుడెలా ఉందో తెలియదు. ఊరి చివర శిలగుహ ఉన్నది. దానిలో పశువులు గడ్డి మేస్తున్నాయి. ఆ గుహ వెనుక శిల భాగంలో అద్భుతమైన భైరవ ప్రతిమ ఉన్నది.

మన ప్రాంతంలో పంచయతన పద్ధతే కాక, కుమారస్వామిని ఆరాధించిన విధానం కనిపిస్తుంది. వరంగల్ పురావస్తు పరిశోధనశాలలో షణ్ముఖుని మూర్తి సుందరమైనది కనిపిస్తుంది. ఆ విధంగా ఆదిశంకరులు స్థాపించిన షణ్మే తములను సమానంగా ఆరాధించినట్టు తెలుస్తుంది. నన్నయభట్టు షడస్య అని పేర్కొనగా, పోతన పుట్టం పుట్ట అనగా, ముక్కుతిమ్మన కవితా ప్రావీణ్య ఫణి శఅని, విశ్వనాథ సత్యనారాయణ కవిత్వ కాళోగ్ర కార్తీకేయుడు అని అన్నారు. ఈ స్తుతి పరంపర అంతా తెలుగుప్రాంతంలో వ్యాపించి ఉన్న సుబ్రహణ్య ఆరాధన స్పష్టం చేస్తుంది. ఈ విధంగా తెలుగు దేశంలో శంకరుల మార్గము తాత్వికంగా అంతర్వాహిని బాహ్యంగా షణ్మత స్థాపకమై వెల్లివిరిసింది. కవిత్రయము పోతన, రాయలు, రామకృష్ణు డు, వీళ్లందరూ ఈ సమభావానికి కేతనమెత్తినవారుగా చెప్పుకోవచ్చు.

- కోవెల సుప్రసన్నాచార్య

161
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles