రామాయణ రసవాహిని


Mon,June 10, 2019 01:22 AM

నన్నయ, తిక్కనల నడిమి కాలంలోనూ తర్వాత ఎర్రన కాలంలోనూ కొనసాగిన సారస్వత ప్రవాహం.. రామాయణ ప్రసారం. వాల్మీకి నోట ఎప్పుడు వెలువడిందో కానీ రామాయణం, భారతీయుల మనసులలో అనన్య సాధ్యమైన ప్రతిష్ఠను సంపాదించుకొన్నది. వాల్మీకి మొదట కిరాతుడై తర్వాత మునిగా పరివర్తన చెందినట్టు ఒక గాథ ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ గాథలోని సత్యాసత్యాలు ఎట్లా ఉన్నా మనిషి తన భౌమ సంస్కారాల నుంచి కామక్రోధాదుల నుంచి అతి లోభ బుద్ధి నుంచి మృత్యుభయం నుంచి విముక్తి చెందేందుకు రామాయణం ఆ గ్రంథ పారాయణం కొన్ని వేల ఏండ్లుగా మన దేశంలో జరుగుతూ వస్తున్నది. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యాతం భద్రమస్తువః ప్రవ్యాహరత విస్రగ్ధం బలం విష్ణోః ప్రవర్థతాం అని గ్రంథ ఫలశృతి చెప్తున్నది. మనందరికీ క్షేమం కలిగించే ఈ గ్రంథం అధ్యయన అధ్యాపనాలు జగద్వ్యాప్తమైన మూల చైతన్యమైన విష్ణువు యొక్క బలాన్ని పెంపొందిస్తున్నది. విష్ణువు బలాన్ని పెంపొందించడం అనే మాట వైదికమైంది. ఇక్కడ విష్ణు బలం అంటే మనిషి అంతర్ముఖుడై తనను తాను పరిమితుల నుంచి ఛేదించుకొని విశ్వచైతన్యంతో తాదాత్మ్యం చెందడమని తాత్పర్యం.

శ్రీరామచంద్రుడు ఆదర్శమానవ వ్యక్తిత్వానికి ఆదర్శప్రాయమైన ప్రతీక. ఈ ఆదర్శం గురించి రామాయణం ఆరంభంలోనే పదహారు గుణాలు కేంద్రీకృతమైన మానవుడుగా షోడష కళాప్రపూర్ణడైన చంద్రుడుగా రాముడు నిరూపించబడ్డాడు. ఈ చంద్రకళాస్వరూపం దేవీ ఉపాసకులకు ప్రత్యక్షమయ్యే లలితాదేవి, రాజరాజేశ్వరిరూపం. అట్లాగే శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీమన్నారాయణుని సంపూర్ణమైన అవతారం. రాఘవత్యే భవత్ సీతా రుక్మిణీ కృష్ణ జన్మని అన్న మాటను భావన చేస్తే ఈ కావ్య నాయకుడు లక్ష్మీ నారాయణ స్వరూపుడుగా భావింపబడినాడు.
రామాయణం మనకు ఆది కావ్యం. మన కవిత్వ విద్య అంతా ఈ గ్రంథంలోనే అమృతం గూడు కట్టినట్లుగా రూపింపబడింది. ఈ సం సారమిదెన్ని జన్మలకునేని మౌని వాల్మీకి భా
షా సంక్రాంంత ఋణంబు దీర్పగలదా తత్కావ్య నిర్మాణ రే
ఖా సామర్థ్య ఋణంబు దీర్పగలదా కాకుత్సుడౌ స్వామి గా
థా సంపన్నము భక్తి దీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్..
అని కల్పవృక్షకవి వాల్మీకి కావ్యశిల్పాన్ని గురించిన తన అచ్చెరువును ప్రకటించాడు. తర్వాత వచ్చిన భారతీయ వాఙ్మయమంతా వాల్మీకికి ఋణపడి ఉన్నదే. ఒక్క వాల్మీకి యే రూపమొందినాడో కాళిదాసుగ, భవభూతిగా జగాన ఇద్దరు కవులనే పేర్కొన్నా మన కవి పరంపరలో అనేకమందికి ఈ మాట సరిపోతుంది.

వాల్మీకి రామాయణాన్ని గూర్చి బహు ప్రాంతాలలో అనేక నిరూపణలు మనకు కనిపిస్తాయి. వీటిలో ప్రధానమైనది సీతా పరతత్త నిరూపణం. దీనికోసం సీతారామణం, లంకా విజయం వంటి కావ్యాలు వెలువడ్డాయి. సీతాదేవిని మహామాయగా, ఆదిపరాశక్తిగా, పరతత్త్వ స్వరూపిణిగా ఇవి నిరూపించాయి.


తెలుగు సాహిత్యానికి సంబంధించిన మహాభారత సందర్భంలో వేదవ్యాసుని వివర్త రూపా లు ముగ్గురే. కవిత్రయమే. (శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి గారి మహాభారత అనువాదం ఎంతగొప్ప ప్రయత్నం అయినా వంద సంవత్సరాల కాలం ఇంచుమించుగా రచన జరిగిపోయినా పఠన పాఠశాలలో అంతగా కనిపించదు) కానీ శ్రీమద్రామాయణానికి సంబంధించినంత వరకు వాల్మీకి వివర్త రూపాలు నూటికి మించే ఉంటా యి. తిక్కనకాలం నాటికే ఆయన తాతగారు మంత్రి భాస్కరుడు రామాయణం చెప్పినట్లుగా తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో పేర్కొన్న తర్వాత తిక్కన స్వయంగా ఉత్తర రామాయణా న్ని నిర్వచనంగా తన పోషకుడైన ప్రభువులు మనుమసిద్ధికి అంకితంగా రచించారు. కాకతీయుల ఆస్థానంలో ఉన్న ఒక సేనాపతి గంగయ సాహిణికి అంకితంగా హుళుక్కి భాస్కరుడు చం పూ పద్ధతిలో రామాయణాన్ని రచించారు. ఈయన తోడుగా ఈ రామాయణ రచనలో అయ్యలార్యుడు కుమార రుద్రదేవుడు దీన్ని పూర్తిచేయడంలో తోడ్పడ్డారు. కవిత్రయ భార తం వలెనే దీనిలోనూ పఠన పాటవాలకు యోగ్యమైన శైలి ఉన్నది. ఆకాశంలో మబ్బులు పట్టినప్పుడు అంతా చీకటిగా మారినప్పుడు.. ఏ వస్తువునూ గుర్తించలేనప్పుడు లోకమెట్లా కనిపించిందో భాస్కర రామాయణం ఇలా వర్ణించింది..

యమునద్గంగము, కృష్ణభూమదిలము అబ్జాక్షన్మనుష్యంబు, నీ
లమహీధ్రనిన్నిఖిలాగామావళి, తమూలద్భూజమిందీవరత్కుముదశ్రేణి...
ప్రపంచమంతా నీలమేఘాల కాంతివల్ల ఎలా తమోమయంగా మారిందో అద్భతమైన రీతిలో వర్ణించారు. భాస్కర రామాయణం అనేకుల రచన యైనా పాఠకులకు కావ్యానుభవాన్ని అందించడంలో ఒకే కవికృత కావ్యంగా గోచరిస్తుంది.
దీని తర్వాత ఇంచుమించు ఇదే కాలంలో రంగనాథ రామాయణం వచ్చింది. గోనబుద్ధారెడ్డి అతని సంతానం నిర్మించిన ఈ కావ్యం సరసమైంది. సులభమైంది. పాడుకోవటానికి అనుకూలమైంది. దీనిలో అనేక గాథలు మూల రామాయణంలో ఉన్నవి కావు. ఇతర రామాయణాలలో వేరైన రామ సారస్వతం ప్రసిద్ధికి వచ్చిన గాథలు చేర్చబడ్డాయి. ఈ గాథలన్నీ ప్రజలలో అధికంగా వ్యాపించి ఉండటం వల్ల ఈ రామాయణం రచించిన కాలం నుంచి ఈ నాటి వరకు జనప్రియంగా సహృదయరంజకం గా ప్రచారంలో కొనసాగుతూ ఉంది. ఇంద్రజి త్తు భార్య సులోచన గాథ దీనిలోని అపూర్వ కథలలో ఎక్కువగా వ్యాప్తి పొందింది. రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి ప్రభృతులు కర్తలై నా చక్రపాణి రంగనాథుడే కర్త అని చాలాకాలం మన విమర్శకులు భావించారు. దేశంలో బహుళంగా ప్రదర్శింపబడే తోలు బొమ్మలాటలలో ఈ రామాయణంలోని భాగాలు భావస్ఫురణ కోసం ఆడబడుతూ ఉండేవి. అందువల్ల ఇది అధికంగా వ్యాప్తి పొందిన రచన.

ఈ విధంగా ఈ రెండు రామాయణాలు తెలు గు సారస్వతంలో మార్గదేశి సంప్రదాయాల ప్రతినిధులుగా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. తర్వాత రామాభ్యుదయం వంటి కావ్యాలు, ప్రబంధాలు, యక్షగానాలు, వచన కావ్యాలు, ఆధ్యాత్మ రామాయణం వంటివి కీర్తన రూపాలతోపాటు, రచనా కాలాన్ని ఇదమిత్థంగా నిర్ణయించడానికి వీలులేని స్త్రీల రామాయణ పాట లు కూడా వచ్చాయి. ఇలా ఈ రామాయణ సారస్వతవాహిని అనంతంగా కొనసాగుతూవచ్చింది. ఆధునిక కాలంలో గడిచిన రెండు శతాబ్దాల లో వాల్మీకి రామాయణానికి అనుకరణలు అనువాదాలు పరిణత రూపాలు ఎన్నో వెలువడ్డా యి. వాల్మీకి రామాయణాన్ని మించి ఆధ్యాత్మ రామాయణం ఆనంద రామాయణం, మొదలైన రామాయణ కథా వ్యాఖ్యరూప రచనలు ఎన్నో వెలువడ్డాయి. తమకిష్టమైన రీతిలో రామగాథను పాక్షికంగానో, సంపూర్ణంగానో పద్యరూపంలో గద్యరూపంలో నాటకాల రూపంలో నిర్వహించిన వందలమంది కవులు ఉన్నారు. అంతేగాక మన దేశంలోని ఇతర భాషలలో వెలువడిన ప్రసిద్ధ రామాయణాలను యథాశక్తిగా అనువదించి అందించినవారున్నా రు. తులసీదాస్‌గారి రామచరితమానస్‌కు రెం డు మూడు అనువాదాలు తెలుగులో వచ్చాయి. అట్లాగే మైథిలీశరణ్ గుప్త సాకేత్ అనే మహాకావ్యానికి తెలుగులో అనువాదాలు వచ్చాయి. కంబన్ తమిళంలో రచించిన రామాయణం తెలుగులోకి పద్యరూపంలోనూ వచన రూపంలోనూ పరివర్తితమైంది. రామాయణంలోని ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క పాత్రను ఆధారం చేసుకుని శ్రీవైష్ణవాచార్య పురుషులు తమ గ్రం థాలలో చేసిన వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమాన్ గుదిమెళ్ల రామానుజాచార్యులు ఇరవైకి పైగా కావ్యాలు రచించారు.

రామాయణ పరివర్తకులలో రెండు మూడు అంశాలు ప్రధానంగా పనిచేశాయి. మొదటిది వాల్మీకి కవితయందు వారు పొందిన సమ్మోహ శీలము అందువల్ల వాల్మీకిని వీలైనంత సన్నితం గా ప్రతిఫలింపచేయడం ఆయన కవిత్వ గౌరవా న్ని సంభావింపచేయడం ఒకటి. వాల్మీకి చిత్రణలోని పాత్రలు, సన్నివేశాలు తమ భావనకు అనుగుణంగా లేవని భావించి ఆధునిక భావముల ఒత్తిడితో ఆ ఘట్టాలను పునర్ వ్యాఖ్యానంచేసే ప్రయత్నం రెండవది. రామగాథను ప్రతీకాత్మకంగా గ్రహించి దానిలోని ఆధ్యాత్మికాంశాలను విస్తరించి వివిధ తాత్తిక సంప్రదా య భావనలను గౌరవించి ప్రతీకాత్మకంగా నిర్మించడం మూడవది. రామకథా సంప్రదాయానికి భిన్నంగా ఆనాటి జస్టిస్‌పార్టీ మొదలైన వారి భావనలకు అనుగుణంగా కథారూపాన్ని మార్చి పాత్రల వ్యక్తిత్వాలను రూపుకట్టించి ఆనాటి భావనలకు అనుగుణంగా రచనను కొనసాగించటం నాలుగవది. రామాయాణానికి ప్రతిబింబంగా ఉండే నూతన కథానిర్మాణంలో రైతు రామాయణం, గ్రామాయణం మొదలైన రచనలు కొనసాగించటం ఐదవది. ఇంకా ఎన్నో విధాల, భావాల, సంఘర్షణల, ఇష్టాయిష్టాల, రాగద్వేషాల పరిణామాలు రామకథా వ్యాఖ్యానంలో మనం చూడవచ్చు.

వాల్మీకి రామాయణాన్ని గూర్చి బహు ప్రాం తాలలో అనేక నిరూపణలు మనకు కనిపిస్తా యి. వీటిలో ప్రధానమైనది సీతా పరతత్త నిరూపణం. దీనికోసం సీతారామణం, లంకా విజయం వంటి కావ్యాలు వెలువడ్డాయి. సీతాదేవిని మహామాయగా, ఆదిపరాశక్తిగా, పరతత్త్వ స్వరూపిణిగా ఇవి నిరూపించాయి. రామాయణమని, సీతా చరితమని, పౌలస్త్యవధమని మూడు త్రోవలలో తాను రచిస్తున్నట్లు వాల్మీకి పేర్కొన్నాడు. దీనివల్ల వ్యాఖ్యకు సహ్యత అనంతంగా ఉన్నట్లు మనకు తెలియవస్తున్నది. ఈ సందర్భంలో రామాయణంలోని బాలకాండం లోని చాలా భాగం ఉత్తరకాండలోని ఎక్కువభా గం ప్రక్షిప్తాలని పరిశోధకులు అర్ధశతాబ్దం ముం దు భావించేవారు. ఉత్తర రామాయణం లేకపో తే శంబూకవథ లేదు. సీతాపరిత్యాగగాథ లేదు. యుద్ధకాండ చివరన వాల్మీకి కావ్య ఫలశ్రుతిని చెప్పారు.

ఈనాడు మనం ఆక్షేపిస్తున్న అనేకాంశాలు ఉత్తర రామాయాణానికి సంబంధించిన వి. అలా ఐనపుడు ఈ ఆక్షేపణలకు నిలిచే అవకాశం ఉండదు. బౌద్ధ, జైన రామాయణాలలోని కొన్ని అంశాలు వాల్మీకి ఆశయానికి భిన్నంగానే ఉన్నవి. ఇక్కడ ఒక్కొ సంప్రదాయం తమ విశ్వాసాలను బట్టి తమకనుగుణంగా రామగాథను చిత్రీకరించాయి. ఆ మూల గాథ యొక్క బలం ఎన్ని సంవత్సరాలైనా అలాగే కొనసాగుతుంది. పోతన్న భాస్కరుని గురించి అతని రామాయణ రచన గురించి మాట్లాడుతూ భాస్కరుడు నిర్మించెను గాని నేనురామాయణా బండ్లకెత్తియుందునని అన్నాడు
యావత్ స్థాస్యంతి గిరయః
సరితశ్చమహీతలే
తావద్రామాయణీ గంగా
లోకేశు ప్రచరిష్యతి

- కోవెల సుప్రసన్నాచార్య

192
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles