పండితారాధ్య చరిత్ర ఒక విజ్ఞాన సర్వస్వమే


Mon,June 3, 2019 01:25 AM

భారతీయ సాహిత్య వికాసములు నన్నయ కాలం పరివర్తన శీలం అయింది. పాకృత ప్రాభవం తగ్గి సంస్కృతంలో కావ్యాలు, నాటకాలు గద్యకావ్యాలైన కాదంబరి వంటివి వెలువడుతున్నాయి. ఆ కాలంలోనే భోజుని చంపూ రామాయణం వచ్చింది. అప్పటికే జైన బౌద్ధాలు వెనుకబడినాయి. పూర్వోత్తర మీమాంసలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. జ్ఞానానికి అద్వైత శాస్త్ర విచారము, అనుష్ఠానానికి పూర్వ మీమాంసలు పాదులైనాయి. పూర్వ మీమాంసలోని పశు హింసా భావానికి ఆదరణ తగ్గి ప్రతీకాత్మకంగా పిష్ఠ పశువధ వంటి రూపాలు ఆచరణలోనికి వసున్నాయి. క్రమంగా శైవము, వైష్ణవము వృద్ధి పొంది అద్వైత విచార స్థానంలో వైరాగ్యానికి బదులు భక్తి అనే ప్రేమ భావం ఉప్పొంగుతున్నది.

భారతీయ భాషా సాహిత్యాలు రూపొందటం ప్రారంభం అయిం ది. ఇప్పుడు ఏర్పడ్డ సాహిత్యాలు ఆధునిక భారతీయ భాషలకు సంబంధించినవి. ఒక్క తమిళంలో సంగం కాలం నుంచే సాహిత్యం కవిత్వం ఒక ప్రత్యేకమైన వస్తువుతో మతాతీతమైన భావనలతో వెలువడింది. తరువాత భక్తి సాహిత్యము సముద్రం వలె ఉప్పొంగింది. కంబన్ వంటి కవు లు రామాయణాన్ని రచించారు. తమిళం తర్వాత దక్షిణాదిలో 9వ శతాబ్దంలో సాహిత్యం రూపొందింది. పంప కవి ఆ భాషలో విక్రమార్జున విజ యం అనే కావ్యాన్ని-కన్నడ భారతంలో రచించాడు. ఈ కావ్యం తన పోషకుడు అయిన వేములవాడ చాళుక్య రాజు పేర అంకితంగా రచింపబడింది. దీనిలో మరొక విశేషం ఏమిటంటే కావ్య నాయకుడు అర్జునుడు పాండవులందరూ కాదు. పైగా కావ్యంలోని అర్జునిడికి తనకు పోషకుడైన రాజునకు అభేదాన్ని పాటించాడు. పంప భారతం రచనలో, కూర్పులో వృత్తముల నిర్వహణలో, సమాస కల్పనలో నన్నయ భారతానికి ఆదర్శం గా కనిపిస్తుంది. దీనిలోని అనేక పద్యాలు తెలుగు భారతంలోని పద్యాలు పోలికగా అన్నట్లు ఉభయ భాషా పండితులు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు అర్ధ శతాబ్దానికి ముందే నిరూపించారు,. నన్నయ కవిత్వ నిరూపణకు వాడిన ప్రసన్న కథాకలితార్థయుక్తి అన్నమాట కించిత్ భేదంతో పంప భారతంలోనూ కనిపిస్తుంది. విక్రమార్జున విజయం అనే పంప భారతంలో జైన మత విశ్వాసాలకు ప్రాధాన్యం ఉంటుంది. పంపకవి సోదరుడు వేయించిన కుర్క్యాల శాసనంలో జైన మత ప్రసక్తి ఉన్నది. అయితే నన్నయ నాటికి రాజరాజనరేంద్రుని ప్రేరణతో రచింపబడిన భారతం నాటికి వైదిక మత విశ్వాసాలు ప్రాబల్యం పొందాయి.

పురాణ అనువాదాల వల్ల తెలుగు కవులకు అనేక నూతన కథాంశాలు లభ్యమయ్యాయి. అల్లసాని పెద్దన మనుచరిత్రకు ఆధారమైన స్వారోచిష మనువు కథ దీనిలోనిదే భారతకథా వాహిని కొనసాగుతూ ఉండగానే సాహిత్యరంగంలో శైవకథల ప్రాచుర్యం పెరుగుతూ వచ్చింది. నన్నెచోడుడు, పాల్కుర్కి సోమన నుంచి శ్రీనాథుని దాకా ఈ సంప్రదాయం ప్రవహిస్తూ వచ్చింది.


జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెలుగున రచింపుమని కృతి కర్త అయిన రాజరాజనరేంద్రుడు నన్నయను కోరినాడు. నన్నయ అవిరళ జపహోమ తత్పరుడు జపము, దైవ ధ్యానము, ఉపాసనము భక్తిమార్గంలో ఒక నిచ్చెన. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని భగవంతుడు గీతలో చెప్పినాడు. హేమ తత్పరత ఆయనకు యజ్ఞయాగాదుల యందు న్న నిష్ఠను తెలియజేస్తుంది. ఆయన భావనావీధిలో పూర్వోత్తర మీమాంసలు సంగమించాయి. భారతాన్ని గూర్చి నన్నయ భట్టు వర్ణించినప్పుడు ధర్మ తత్తజ్ఞులు ధర్మశాస్త్రంబని, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియె అని చెప్పిన చోట జైమినీ బాదరాయణులు ప్రతిపాదించిన రెండు మీమాంస లు సంకేతింపబడినాయి. పై పద్యంలో ధర్మం అన్నప్పుడు స్మృతులు అని అర్థం కాదు, అది ధర్మజ్ఞసారూపమైన మీమాంసా శాస్త్రమని ఉద్దేశింపబడినది. ఈ పద్యం పీఠికగా నన్నయ మహాభారతాన్ని అన్ని పరిమితుల ను త్యజించిన విశ్వజనీనమైన ఇతిహాసంగా భావించినాడు. వ్యాసముని ప్రోక్తమైన మహాభారత తాత్పర్యము లక్ష్యమై ఇది వేదార్థ, వేదోబృంహ్మణ లక్ష ణం కలదిగా తెలియవస్తున్నది. దీనినే తిక్కన వైదికధ్యాయిత అన్నాడు. అందువల్లనే దేనిని వింటే జ్ఞానం సమగ్రం అవుతుందో, దేని శ్రవణం పాపములను హరిస్తుందో దానిని వినదలిచినట్లు భారత శ్రోతలైన శౌనకాదులు పేర్కొన్నారు. నన్నయ తిక్కనల నడుమ కాలం సుమారు రెండువందల సంవత్సరా లు. ఈ కాలంలో మృగశిర కార్తె తర్వాత నాట్లు పోసినట్లు అపారమైన కావ్య వ్యవసాయం వైవిధ్యభరితంగా కొనసాగింది. నన్నెచోడుని కుమారసంభవం మహాకావ్య లక్షణాలను పొదువుకున్నది. మానవల్లీ వారు నన్నెచోడున్ని నన్నయకు పూర్వపు కవిగానే పేర్కొన్నారు.

కాని తరువాత తెలు గు విమర్శకులు తర్వాత వందేండ్లలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. సుప్రసిద్ధ చారిత్రకులు బి.యన్ శాస్త్రి గారు నన్నెచోడుని కాలాన్ని తమ సిద్ధాంత గ్రంథంలో నన్నయ్యకు పూర్వ కవిగానే భావించిన ఆయన పర్యవేక్షకులైన ఆచార్య దివాకర్ల వెంకటావధాని ఆయన నిర్ణయాన్ని మార్చుకోమని పట్టుబట్టారు. ఆయన దానికి అంగీకరించిన పీహెచ్‌డీ పట్టానే వదులుకున్నారు. ఈ సందిగ్ధమైన అంశాన్ని ఇక్కడ తేల్చలేరు కాని ఇన్నూరు సంవత్సరాలలో పావులూరి మల్లన గణితసారం వంటి శాస్త్ర గ్రంథం వచ్చింది. కేతన దశకుమార చరిత్ర వంటి కథాకావ్యం వచ్చింది. కేతన విజ్ఞానేశ్వరీయం అనే స్మృతి గ్రంథాన్ని వెలువరించాడు. అంతేకాక ఈయ న ఆంధ్ర భాషా భూషణం అనే వ్యాకరణ గ్రంథా న్ని కూడా రచించాడు. ఈయన తిక్కన శిష్యుడు. తిక్కనను గూర్చి చిత్తనిత్యస్థిత శివుడు అని వర్ణించాడు. కవిత చెప్పి ఉభయకవి మిత్రుమెప్పింపనరిది - అట్టివాని మెప్పు పొందిన వాడనని తన్ను తాను ప్రశంసించుకున్నాడు. తిక్కన శిష్య పరంపరలో ఆయనతో పాటు అనేకమంది పండితులైన శిష్యులు వచ్చి ఉంటా రు. ఆనాటి రోజులలో కమలాకరం వంటి సాహి త్య కేంద్రం ఓరుగల్లు నగరం. కొందరు ఆయన తో పాటు నెల్లూరుకు తిరిగి వెళ్లకుండా ఓరుగల్లులోనే ఉండిపోయి ఉంటారు. వారిలో ప్రథమాం ధ్ర పురాణాన్ని తెలుగులోకి అనువదించిన మార న ఒకడు కావచ్చు. మారన ప్రారంభించిన పురా ణ పరివర్తన మార్గంలో శ్రీనాథుని కాలంలో వృద్ధి పొందింది. తరువాత కాలంలో సమగ్రం కాకపోయిన సమృద్ధతను సంపాదించుకున్నది. పురాణ అనువాదాల వల్ల తెలుగు కవులకు అనేక నూతన కథాంశాలు లభ్యమయ్యాయి. అల్లసాని పెద్దన మనుచరిత్రకు ఆధారమైన స్వారోచిష మనువు కథ దీనిలోనిదే భారతకథా వాహిని కొనసాగుతూ ఉండగానే సాహిత్యరంగంలో శైవకథల ప్రాచుర్యం పెరుగుతూ వచ్చింది.

నన్నెచోడుడు, పాల్కుర్కి సోమన నుంచి శ్రీనాథుని దాకా ఈ సంప్రదాయం ప్రవహిస్తూ వచ్చింది. అనేక భాషా సంప్రదాయాలు, మార్గాలు, పోకడలు నూతన సృజనశీలానికి దోహదం చేశాయి. శైవవాఙ్మయ సృజనలో మహా మకుటధారి అయిన పాల్కుర్కి సోమన భాషా ప్రయోగంలో సంప్రదాయ మత పరిభాషయే కాక, తెలుగు సంస్కృ త పదాలను జోడించడం భాషా పద్ధతికి భిన్నంగా మిశ్ర సమాసాలు, విచిత్ర వ్యాకరణ రూపాలు ప్రయోగించాడు. ఇంతవరకూ కొనసాగించిన భాషా సంప్రదాయం మారిపోవడం వల్ల జానపద వాక్‌ధోరణులు పెరిగిపోవడం వల్ల పాఠకులకు ఇది ఒక కొత్త మార్గమే అయింది. సోమన రచనలో భాషా వేషం ఎంతనో మతావేషమూ అంతదే, భవులు అంటే లింగధారులు కాని శివభక్తులైన ఆయనకు అంగీకారం కాదు. భవి ముఖ దర్శన, స్పర్షణ, ఆలాప శూన్యుడు అని చెప్పుకున్నాడు. భవుల క్షేత్రాలలో నాటిన గింజల ఫలసాయం కూడా తాను ఆహారంగా తీసుకొని తెలియజేస్తాడు. అం త తీవ్ర త కూడా ఆయన సృజనశీలం అక్షతంగా నే ఉండిపోయింది. లోక వృత్తానుశీలనలో ఆయనకు సాటి రాగలవారు తెలుగు సాహిత్యంలో ఇద్దరో, ముగ్గురో ఉండవచ్చు. 1955 ప్రాంతాల లో తన అభిమాన కవి అని పాల్కుర్కి సోమనను ప్రశంసిస్తూ సినారె కోడి కూతను సోమన వర్ణించిన ద్విపద భాగాన్ని వినిపించినప్పుడు నేను పులకించిపోయాను. తరువాత మరొక కోడికూత శివ తరువాత రామాయణ కల్పవృక్షంలో వినబడ్డది. ఛిన్న ఛాపస్వన స్థితి మూడు విరుపులై కొక్కొరకో కోయని కోడికూసె ఇంత అద్భుతమైన లోకజ్ఞతతో పాటు అగాథ మైన పాండిత్యము నింపుకొన్న విశిష్ట మనీషి పాల్కుర్కి సోమనాథుడు పాల్కుర్కి సోమన ఎం త భాషాభిమాని అంటే తెలుగు మాటలు ఏ విధంగానూ తక్కువైనవి కావు. వేదములతో తులతూగదగినవి అని తెలియజేస్తారు. ఆయన సృజనశీలంలోంచి అనేక ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో ఉద్భవించాయి.

వృషాధిపశతకం బస వా! బసవా! బసవా! వృషాధిపా అన్న మకుటం తో తీర్చబడినవి. తరువాతి సంవత్సరాలలో తెలు గు కవుల కల్పనాశక్తికి ఆత్మ నివేదనకు అది కాణా చి అయింది. తెలుగులో శతకాలు అనేక చంధస్సులలో, అనే విషయాలతో అనేక వేల సంఖ్యలో వెలువడ్డాయి. సంస్కృతములో శతకానికి, తెలుగులో శతకానికి ఉండే మకుటం ఉండ దు. ఈ మకుటం జానపదగీతాలలో Refrini లాంటిది. సోమనాథుడు సృష్టించిన ప్రక్రియా విశే షం ఉదాహరణము. ఆయన బసవోదాహరణ ము, మల్లికార్జున ఉదాహరణము అనే రెండు ఉదాహరణలు నేర్పించాడు, ఉదాహరణముతో ఎనిమిది దళాలు ఉంటాయి. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క విభక్తి చొప్పు సం బోధన విభక్తితో ఇవి ఎనిమిది, మొదటి పద్యమైన వృత్తము క్రియా రూపంలో ఆ విభక్తి నిలిచి ఉం టుంది. తరువాత ఒక రగడ ఆది ప్రాసతో మధ్య యతిలో అంత్యప్రాసతో కూర్చబడుతుంది. దీనిని కళిక అంటారు. దీని తరువాత కళిక నిడివిలో సగం భాగంగా ఆది ప్రాసతో అంత్యప్రాసతో ఉత్కళిక ఉంటుంది. ఈ ఎనిమిది దళాల తరువా త సార్వవిభక్తిక పద్యం అంకితాంక పద్యం ఉం టాయి. ఈ రచన స్తోత్ర కావ్యమే అయినా మార్గదేశీ ఛందస్సుల సమ్మేళనంతో సంగీత మాధుర్యం తో సమ్మిళితమై ఉంటుంది. ఈ రెండు ప్రక్రియలే కాక సోమన అక్షరాయ గద్య, మొదలైన చితప్రక్రియల రూపాలు సృష్టి చేశాడు. ఇవికాక అనుభవసారము, చెన్నమల్లు సీసము లు మొదలైన అనేక రచనలు ఉన్నాయి. బసవపురాణ పీఠికలో తన లక్షణ ప్రతిభను వెల్లడించాడు. పండితారాధ్య చరిత్ర ఒక విజ్ఞాన సర్వస్వమే.
- కోవెల సుప్రసన్నాచార్య

256
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles