తిక్కన ప్రతిపాదించిన సమన్వయం


Mon,May 27, 2019 01:13 AM

thikkana
నన్నయ కాలం గడిచిపోయి తిక్కన కాలం వచ్చేటప్పటికి దక్షిణభారతంలో శివభక్తుడైన నాయన్‌మారులు విష్ణుభక్తులు, ఆళ్వార్లు తమ ప్రభావాన్ని సమాజం మీద బలంగా ముద్రిస్తున్నారు. బసవేశ్వరుడు, తమ పాండి త్యం చేత శైవ వైష్ణవ ప్రాధాన్యాలను సమాజం మీద ప్రసరింపజేస్తున్నారు. వీరి ప్రభావం వల్ల సామాన్యుల నుంచి విద్వాంసుల వరకు ఆ సిద్ధాంతాలకు బలం చేకూరింది. నన్నయ్య కాలం నాటి పురుషుల స్థానంలో హరిహరులు ఆదేశంగా వచ్చారు. ఈ హరిహర భావన క్రమంగా అద్వైత తాత్త్విక బలంతో ఒక సమన్వయానికి దారితీసింది. మూర్తి ఉపాసన స్థానంలోకి షట్చక్ర యోగ సాధన వంటి తాంత్రిక మార్గాలు ప్రవేశించాయి. తిక్కన నాటికి ప్రబలమైన కాకతీయ రాజ్యంలో త్రికూట ఆలయాలు, పంచకూట ఆలయాలు ఏర్పడుతూ వచ్చాయి. ఆ ఆలయాలలో హరిహరులకే కాక అమ్మవారికి సూర్యునికి, గణపతికి అక్కడక్కడ కుమారస్వామికి ప్రాధాన్యం ఏర్పడింది. తిక్కన కాకతి గణపతిదేవుని ఆస్థానానికి వచ్చేటప్పటికి హైందవ దేవతా శాఖలలో ఒక సమన్వయం ఏర్పడింది. ఈ కాలంలో మారన రచించిన మార్కండేయ పురాణం, చండీ సప్తసతి ప్రముఖ స్థానంలో ఉంది. ఈ మహా ప్రవక్తల ప్రభావం చేత వచనాలు గద్యరూపంలో వ్యాప్తిలోకి వచ్చా యి. తిక్కన రచన ప్రారంభించే నాటికి మార్గదేశి భేదాలు వ్యాప్తిలోకి వచ్చా యి. శబ్ద జాలంలో దేశి పదాల ప్రాచుర్యం విస్తృతంగా పెరిగింది. నన్నయ్య నాడు రచనంతా సామాన్య గ్రాహ్యమైన తత్సమ శబ్దాలు అధికంగా వ్యాపిం చి ఉన్నాయి.

తిక్కన నాటికి దేశీ పదాల వాడకం బాగా పెరిగింది. పాతబడిన మాటలు అని తిక్కన ఒకచోట అన్నాడు. దానర్థం వ్యవహారం లో నుంచి తొలిగిపోయి అర్థం కాకుండాపోయిన పదాలను ఉద్దేశించి అన్నమాట. తిక్కనకు మార్గదేశి పద్ధతుల్లో ఏ ఒక్కదానిపైనా వీరాభిమానం లేదు. అలాగే తాత్త్వికంగా హరిహరుల మధ్య భేదభావ మూ లేదు. ఆ కారణంగా ఆయన తన ఉపాస్య దైవాన్ని హరిహరనాథుడని పిలుచుకున్నాడు. తిక్కన భారతంలో పర్యంత పద్యాలు సగుణ బ్రహ్మను దాటి నిర్గుణ బ్రహ్మ దాకా వ్యాపించాయి. ఈ సమన్వయం కాకతీయుల నాటి సమన్వి త దేవతా సమభావాన్ని అంగీకరించినట్లయింది. తిక్కన ప్రతిపాదించిన సమన్వయం తెలుగు సాహిత్యంలో నాటి నుంచి నేటి దాకా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది. నన్నయ్య గురించి ఆయన ప్రశంసించినప్పుడు ఆయన ఆంధ్రకవితా విశారదుడు అని మహితాత్ముడని పేర్కొన్నాడు. ఆ నన్నయ రచించిన భాగాన్ని, వివిదార్థ గతి స్ఫురణం కలదిగా ఉద్ఘాటించాడు. నన్నయ్య అవతారికలో సారమతులని, సహృదయులు అని ప్రకటించాడు. సారం అంటే కవిత్వాన్ని అనుభవంలోనికి ప్రవేశింపజేసే ప్రక్రియ క్రమంలో మనస్సులో కలిగే విచిత్రమైన శాబ్దిక పరిణామం అని గ్రహించాలి. ఇది సూర్యకిరణాల వల్ల చెట్లపైన జరిగే పత్రహరిత క్రియ వంటిది. సారమైన రసం దాన్ని గ్రహించే బుద్ధి ఈ రెంటి మధ్య జరిగే సరస్వతి విలాసమని మనం గ్రహించాలి. ఈ సందర్భంలో పైపైన కనిపించే అక్షరాల పోహళింపు. దాని వల్ల కలిగే గాఢమైన సంగీత స్ఫురణలు ఉద్దేశించబడినాయి.

పై పొరలోని అంశాన్ని కొంచెం తరచిచూస్తే కావ్య రహస్యాన్ని ప్రసన్న కథా కలితార్థయుక్తి అని ఆదికవి పేర్కొన్న లక్షణం బహిర్గతం అవుతుంది. కథ దాని బహుముఖాలు ఆంతరికమైన స్ఫురణలు నిర్దేశించబడుతున్నాయి. కావ్యం యొక్క బైట, లోపలి పార్శాలు చక్కగా వెల్లడి అయితేనే కావ్యం సహృదయుడికి ఆస్వాద్యమవుతుంది. అందుకే ఏ యది హృద్యము, అపూ ర్వం ఏద్దాని వినిన ఎరుక సమగ్రంబైయుండు అన్న పద్యం సారమతి పద్యంలోని తాత్పర్యాన్ని స్పష్టంగా వెల్లడించింది. నన్నయ్య సాగించిన తోవలోనే తిక్కన భారతాన్ని సమగ్రంగా తీర్చిదిద్దాడు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు నన్నయ్య కవి పెట్టినాడు కదా తిక్కనాది కవీంద్రులకు ఆది భిక్ష, భిక్షములో భిక్ష పెట్టె శ్రీనాథాది కవులకెల్లరకు తిక్కన మనిషి అని నన్నయ్య, తిక్కనల ప్రాధాన్యాన్ని వెల్లడించారు. ఆ ఇద్దరి అడుగుజాడల్లోనే తెలుగు కవిత్వం అంత రూపుదిద్దుకున్నది. కల్పవృక్ష అవతారికలో విశ్వనాథ నన్నయ్యయు, తిక్కన్నయు నన్నావేశించి అని ప్రకటించారు. ఆ ఇద్దరు తీర్చిన అడుగు జాడలే మన సాహిత్యాన్ని పరిపాలిస్తున్నాయి.
- కోవెల సుప్రసన్నాచార్య

174
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles