సారీ.. గంగ్న‌మ్ స్టైల్.. యూట్యూబ్ లో నీ రికార్డు చెదిరిపోయింది!Wed,July 12, 2017 06:08 PM

Wiz Khalifa - See You Again becomes Youtube's most Viewed Video

యూట్యూబ్ లో ఆ వీడియో ఓ సంచ‌ల‌నం. ఓపెన్ గంగ్న‌మ్ స్టైల్ అంటూ సౌత్ కొరియా కు చెందిన సింగ‌ర్ సై పాడుతూ డ్యాన్స్ చేసిన వీడియో అది. జులై 15, 2012 న యూట్యూబ్ లో రిలీజ‌యిన గంగ్న‌మ్ స్టైల్ సాంగ్ గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా యూట్యూబ్ లో టాప్ పొజిష‌న్ లో నిలుచున్న‌ది. అయితే... గ‌త ఐదు సంవ‌త్స‌రాల సై రికార్డును సింపుల్ గా బ‌ద్ద‌లు కొట్టేసింది మ‌రో వీడియో. ప్ర‌స్తుతానికి గంగ్న‌మ్ స్టైల్ వీడియో కు ఉన్న వ్యూస్ మొత్తం 2,896,363,483(289 కోట్ల 63 ల‌క్ష‌ల 63 వేల 483 వ్యూస్).

ఇక‌.. యూట్యూబ్ లో టాప్ పొజిష‌న్ ను ద‌క్కించుకున్న వీడియో పేరు Wiz Khalifa - See You Again, ఫ్యూరియ‌స్ 7 మూవీ కోసం ఈ సాంగ్ ను పాడారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ యాక్ట‌ర్ పాల్ వాక‌ర్ కార్ యాక్సిడెంట్ లో చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఫ్యూరియ‌స్ 7 మూవీ షూటింగ్ పూర్త‌వ‌కముందే ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న జ్ఞాప‌కార్థం ఈ వీడియో ను రూపొందించింది మూవీ యూనిట్. ఏప్రిల్ 6, 2015 న రిలీజ‌యిన ఈ వీడియో తొంద‌ర‌లోనే సై గంగ్న‌మ్ ను బీట్ చేసి ఫస్ట్ పొజిష‌న్ లో నిల‌బ‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోకు 2,903,310,644 (290 కోట్ల 33 ల‌క్ష‌ల 10 వేల 644) వ్యూస్ వ‌చ్చాయి.
టాప్ పొజిష‌న్ లో ఉన్న వీడియో ఇదే..రెండో ప్లేస్ కు ప‌డిపోయిన సై గంగ్న‌మ్ స్టైల్ వీడియో ఇదే..

6297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS