క‌శ్మీర్‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ ఎందుకు చేప‌ట్ట‌రు: క‌మ‌ల్‌హాస‌న్

Mon,February 18, 2019 12:32 PM

Why India is not holding a plebiscite in Kashmir, asks Kamal Hassan

చెన్నై: పుల్వామా దాడిని యావత్‌ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఎంతో మంది అమరజవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో కొందరు కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సినీ హీరో, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమలహాసన్‌ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చెన్నైలో ఇవాళ మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

క‌శ్మీర్ అంశంపై ప్ర‌జాభిప్రాయ‌సేక‌ర‌ణ ఎందుకు నిర్వ‌హించ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. చెన్నైలో ఆదివారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఎందుకు జంకుతున్న‌ద‌ని ఆయ‌న అడిగారు. కేవ‌లం సైనికులే ఎందుకు చ‌నిపోతున్నార‌ని, మ‌న ఇంటి కాప‌లాదారుడే ఎందుకు చావాల‌ని, రెండు దేశాల రాజ‌కీయ నేత‌లు స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తే, మ‌న సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని, నియంత్ర‌ణ రేఖ అప్ప‌డు మ‌న ఆధీనంలోనే ఉంటుంద‌ని క‌మ‌ల్ అన్నారు.

2330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles