HomeLATEST NEWSwednesday 13 september 2017 horoscope details

13 సెప్టెంబర్ 2017 బుధ‌వారం మీ రాశి ఫలాలు

Published: Wed,September 13, 2017 06:52 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

మేషం

ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దాని కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు.

వృషభం

ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వేడుకలో లేదా ఉత్సవంలో పాల్గొంటారు. పోటీల్లో గెలుపొందుతారు లేదా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ప్రేమను వ్యక్తపరచటం కానీ, ఇష్టమైన వ్యక్తులను కలవడం కానీ చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

మిథునం

ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. మీమిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు.

కర్కాటకం

ఈ రోజు రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనడం కానీ, ఇల్లు సర్థడం కానీ చేస్తారు.

సింహం

ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శివున్ని పూజించండి.

కన్య

ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్యం లేదా విద్యా పరంగా కొంత ఆందోళన చెందుతారు.

తుల

వివాదాలు పరిష్కరించుకోవటానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆం దోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

వృశ్చికం

మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూ ల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియ ని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది.

ధనుస్సు

ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుం ది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మానసికంగా కొంత ఆందోళన కానీ, పరాకుగా కానీ ఉండటం జరుగుతుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉం టుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

మకరం

ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్నేహ సంబంధాలు మెరుగు పడతాయి. వివాదాలు సమసిపోతాయి. నూతన వస్ర్తాలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేసారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కుంభం

పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధిం చి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

మీనం

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది.
7324
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology