రేషన్ షాపుల్లో విజయ ఆయిల్ !

Fri,July 29, 2016 06:32 AM

vijaya oil ration shops telangana civil supplies

హైదరాబాద్ : జంట నగరాల ప్రజలకు ఇదో శుభవార్త. నమ్మకం, స్వచ్ఛతకు మారుపేరైనా, తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ వంటనూనె ఇక నుంచి రేషన్ షాపుల ద్వారా తీసుకువచ్చే సదవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. వంటనూనె లు సర్వం కల్తీమయవుతున్న తరుణంలో ప్రజలకు విశ్వాసమైన విజయ ఆయిల్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో కంటే అతి తక్కువ ధరల్లో రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన నూనెను అందిస్తామంటూ సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ముందుకొచ్చింది. ఈ మేరకు బేగంపేటలోని సీఆర్వో కార్యాలయంలో అయిల్ ఫెడ్ శాఖ అధికారులు, సివిల్‌సైప్లె అధికారులు ప్రత్యేక సమావేశం అయ్యారు.

వంటనూనెను లీటర్ ఫ్యాకెట్ల ద్వారా ఆయా రేషన్ షాపులకు అందజేస్తామని అయిల్‌ఫెడ్ అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. బహిరంగ మార్కెట్లో లీటర్ విజయ వంటనూనె రూ. 69లు ఉంటే రేషన్‌షాపులకు సబ్సిడీ ద్వారా ఒక్కొ లీటర్‌పై రూ.5ల నుంచి రూ.10ల వరకు తగ్గించి ఇస్తామని, ఈ రేటుతో ప్రజలకు అందించవచ్చని సివిల్‌సైప్లె అధికారులకు సూచించారు. దీనిపై సూత్రప్రాయంగా సివిల్‌సైప్లె అధికారులు అంగీకారం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత తీసుకువచ్చి ఆగస్టు 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో విజయ అయిల్ అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రేషన్‌షాపుల్లో విజయ అయిల్ మాత్ర మే ఉండాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.

1443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles