విజయ్ మాల్యా విదేశీ ఆస్తులెన్ని?

Tue,October 25, 2016 11:58 PM

Vijay Mallya foreign assets?

-నాలుగు వారాల్లో వెల్లడించాలన్న సుప్రీం
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: విదేశాల్లో ఉన్న ఆస్తుల పూర్తి వివరాలను వెల్లడించనందుకు మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను నాలుగు వారాల్లో అందజేయాలని ఆదేశించింది. గత ఫిబ్రవరిలో బ్రిటన్ సంస్థ డయాజియో నుంచి స్వీకరించిన 40 మిలియన్ డాలర్లకు సంబంధించిన వివరాలను అందజేయకపోవడం పట్ల జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని బట్టి గత ఏప్రిల్ 7న ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను అమలు చేయలేదని ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్నదని పేర్కొంది. 40 మిలియన్ డాలర్లను ఎలా స్వీకరించారు. వాటిని ఏం చేశారన్న వివరాలు అందజేయాలని ఆదేశించింది. మాల్యా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, న్యాయస్థానాలను మోసం చేసేందుకు ప్రయత్నించాడని అటార్నీ జనరల్ రోహత్గీ పేర్కొన్నారు.

101
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles