'వెరీఫాస్ట్‌'కు వరుసగా మూడోసారి అవార్డు

Fri,June 22, 2018 09:48 PM

Very fast technology app won Central Foreign Office Award

హైదరాబాద్ : పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు తీసుకువచ్చిన వెరీఫాస్ట్ టెక్నాలజీ యాప్‌కు వరుసగా మూడోసారి కేంద్ర విదేశాంగశాఖ అవార్డుకు ఎంపికైంది. పాస్‌పోర్టు పోలీస్ వెరిఫికేషన్ విభాగంలో 2017-18 ఏడాదికి పోలీస్ ఇనిస్టిట్యూషనల్ అవార్డు ఫర్ దబెస్ట్ పోలీస్ వెరిఫికేషన్ అవార్డును తెలంగాణ పోలీస్‌శాఖకు ప్రకటించింది. పాస్‌పోర్టు సేవాదివస్‌ను పురస్కరించుకుని ఆదివారం ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ అవార్డును అందుకునేందుకు రావాలంటూ కేంద్ర విదేశాంగశాఖ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆహ్వానం అందింది. దేశంలోనే అతితక్కువగా 4 రోజుల్లోనే పాస్‌పోర్టు పోలీస్ వెరిఫికేషన్‌ను తెలంగాణ పోలీసులు పూర్తి చేస్తున్నారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఇది రికార్డు సమయం కావడంతో వరుసగా మన రాష్ట్ర పోలీసులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles