ఉర్దూ రచయిత్రి జిలానీ బానుకు ఎన్టీఆర్ పురస్కారం

Mon,May 16, 2016 12:18 AM

Urdu writer, Jilani banu to NTR Award

-ట్రస్ట్ చైర్‌పర్సన్లు లక్ష్మీ పార్వతి, కేవీ రమణాచారి ప్రకటన
ఖైరతాబాద్, మే 15: ఈ ఏడాది ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ప్రముఖ ఉర్దూ రచయిత్రి జిలానీ బాను ఎంపికయ్యారు. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి హైదరాబాద్‌లో ఆదివారం మీడియాకు ఈ విషయం తెలిపారు. సాహితీరంగంలో ఎంతో కృషి చేసిన బాను పద్మశ్రీతోపాటు అనేక అవార్డులు పొందారని, ఆమె రచనలు 24 భాషాల్లో అనువాదమయ్యాయని వారు చెప్పారు. ప్రొఫెసర్ ఖలీద్ ఖాద్రి, రచయిత్రి ఓల్గా, కవి శివారెడ్డిలతో కూడిన జ్యూరీ ఆమెను ఈ ఏడాది ఎన్టీఆర్ పురస్కారానికి ఎంపిక చేశారని తెలిపారు. 2006లో ఎన్టీఆర్ విజ్ఞానట్రస్ట్‌ను ఏర్పాటుచేసి 2007 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు 9 మంది సాహితీమూర్తులకు అవార్డులు అందచేశామన్నారు.

1105
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS