40 దేశాల్లో టీఆర్‌స్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

Fri,June 28, 2019 06:05 PM

TRS party membership campaign started by trs nri branches

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రపంచంలోని 40 దేశాల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాళ లాంఛనంగా ప్రారంభమయింది. టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల.. కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.

ఈసందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను స్థాపిస్తునందుకు ఎన్నారైలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో 40 దేశాల్లోని ఎన్నారై శాఖలు తమ వంతు సహాయాన్ని అందించాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ కోటి మందికి పైగా సభ్యత్వాలను నమోదు చేయాలని పిలుపునిచ్చారని.. ఆమేరకు ఎన్నారై శాఖలు తమ వంతు కార్యచరణ మొదలు పెట్టాయన్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై సలహాదారు, మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో వంద వరకు టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలను విస్తరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

1266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles