థాయ్ రెస్క్యూ ఆపరేషన్.. కోట్లల్లో లైక్‌లు, షేర్లు

Wed,July 11, 2018 05:26 PM

Thailand cave rescue operation gets crores of likes in social media

చియాంగ్ రాయ్: థాయిలాండ్‌లోని లువామ్ గుహ నుంచి 12 మంది బాలలు ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. కోచ్‌తో సహా బాలల్ని బయటకు తీసేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. ప్రత్యేకంగా బ్రిటీష్ డైవర్లు వచ్చాకే ఆ పిల్లలు బ్రతికి ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టారు. ఆక్సిజన్ సిలెండర్లతో లోపలికి వెళ్లి, నీటితో మునిగిన గుహ నుంచి పిల్లల్ని తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా జనం బాగా ఫాలో అయ్యారు. టీవీలు, వెబ్‌సైట్లు, పేపర్లతో పాటు సోషల్ మీడియాలోనూ ఆ పిల్లల వీడియో వైరల్‌గా మారింది. ప్రతి క్షణం ఆ పిల్లల గురించి వెబ్‌లో ఆరా తీశారు. కొందరు గ్రాఫిక్ బొమ్మలు కూడా వేశారు. ఆ ఆపరేషన్ జరిగిన తీరంతా ఓ వ్యక్తి తన గ్రాఫిక్ బొమ్మలో చూపించాడు. ఇది అలాంటి ఫోటోనే. గుహలో చిక్కుకున్న చిన్నారులు, కోచ్‌తో పాటు వాళ్లను బయటకు తీసుకువచ్చేందుకు వెళ్లిన డైవర్లు, ఇతర వ్యక్తులను గ్రాఫిక్ బొమ్మల్లో చూపించారు. పైన బొమ్మలో తెల్ల ఏనుగు గవర్నర్ కాగా, పిల్లల్ని వైల్డ్‌బోర్స్‌గా బొమ్మలో చూపారు. పిల్లల్ని కాపాడిన వాళ్లను తెల్ల ఏనుగులుగా, థాయ్ నేవీ సీల్‌ను సీల్స్‌గా, మేటి డైవర్లను కప్పలుగా, బ్రిటీష్ డైవర్లను సింహాలుగా, ఆస్ట్రేలియా టీమ్ కంగారూలుగా, చైనా టీమ్‌ను పాండాలు, కొంగలను జపాన్ టీమ్‌గా చిత్రీకరించారు.

థాయ్ రెస్య్యూ ఆపరేషన్ గురించి గూగుల్‌లో సుమారు 35 కోట్ల 90 లక్షల మంది సెర్చ్ చేశారట. ఇక రిపోర్టర్లకు చెందిన ఫేస్‌బుక్ లైవ్ వీడియోలు పాపులర్ అయ్యాయి. పిల్లలు త్వరగా బయటపడాలంటూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో మెసేజ్‌లు వెల్లువెత్తాయి. థాయ్‌కేవ్‌రెస్క్యూ, బోర్‌టీమ్, థాయ్‌నేవీసీల్స్, ప్రేఫర్‌థాయ్‌బాయ్స్, బ్రింగ్‌దబోర్‌టీమ్‌బ్యాక్‌హోమ్ పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లో నడిచాయి. థాయ్ నేవీ సీల్స్ తమ ఫేస్‌బుక్‌లో బాలల్ని రక్షించిన వీడియోను పోస్టు చేశారు. దానికి రెండు లక్షల లైక్‌లు వచ్చాయి. ఒక్క గంటలోనే ఆ వీడియోను 56వేల మంది షేర్ కూడా చేశారు. ప్రాణాలతో బయటకు వచ్చిన బాలలకు ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు రావాలంటూ ఆహ్వానం కూడా అందింది.1213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles