మున్నూరు కాపుల మద్దతు టీఆర్‌ఎస్‌ పార్టీకే

Tue,April 9, 2019 05:54 PM

telangana munnuru kapu sangam support to trs mp candidates

నిజామాబాద్: వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో నియోజకవర్గ మున్నూరు కాపు నాయకులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం లోని మున్నూరు కాపు కులబంధువులు, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న 35000 వేల మున్నూరు కాపు కులబంధువులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల 11 న జరుగబోయే ఎంపీ ఎలక్షన్ లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బలపరచాలని పిలుపునిచ్చారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, మున్నూరు కాపు కులబంధువులకు కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంసిద్దంగా ఉన్న సందర్భంగా నేను ఈ మధ్యనే నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.


మన కుల బందువులు అందరూ వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తమని, కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా పథకాలు తీసుకురావడం వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మెజారిటీ మున్నూరు కాపు కుల బంధువులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.. తెలంగాణ రాష్ట్రం అంతటికీ వ్యవసాయానికి సాగు నీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసే ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. కావున రైతుల మేలు కోరి పని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.

మున్నూరు కాపులల్లో కూడా చాలా మంది పేదరికంలో ఉన్నారని వారిని ఆదుకోవడానికి వారి అభివృద్ధి కోసం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు అవసరం అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ సందర్భంగా మున్నూరు కాపుల అభివృద్ధికి రైతుల అభివృద్ధికి అనుకూలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను, ముఖ్యంగా నిజామాబాద్ నుంచి ఎంపీగా కవితని బారి మెజారిటీతో గెలిపించాలని కోరారు.

1846
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles