నాలుగేండ్ల చిన్నారిపై టీచర్ పైశాచికత్వం

Wed,October 14, 2015 11:29 AM

-ఎర్రటి ఎండలో ఇనుప రేకుపై కూర్చోబెట్టిన వైనం
-ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు స్కూల్‌లో ఘటన

ఏలూరు (ఆంధ్రప్రదేశ్), అక్టోబర్ 13: క్రమశిక్షణ పేరుతో చిన్నారులపై ఉపాధ్యాయులు విపరీత బుద్ధిని ప్రదర్శించడం.. కఠినంగా శిక్షించడం లాంటి ఇటీవలి కాలంలో అనేక విమర్శలకు తావిస్తున్నాయి. నాలుగేండ్ల పసిపాప అని చూడకుండా..మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఇనుప రేకుపై కూర్చోబెట్టి ఓ టీచర్ తన పైశాచికాన్ని బయటపెట్టుకున్న ఘటన ఏపీలోని ఏలూరులో ఉన్న హోప్ అనే స్కూల్‌లో చోటుచేసుకున్నది. చిన్నారి ప్రస్తుతం హాస్పిటల్‌లో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నది. ఈ దారుణాన్ని తెలుసుకొన్న తల్లిదండ్రులు ప్రిన్స్‌పాల్ ధనలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో టీచర్, ప్రిన్స్‌పాల్, ఆయాపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహించి.. స్కూల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు బాలల హక్కుల పరిరక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. చిన్నపిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉపాధ్యాయులుగా పనికిరారంటూ కమిటీ ప్రతినిధి అచ్యుత్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles