HomeLATEST NEWSTalasani Srinivas Yadav says wishes to Deputy Speaker Padmarao Goud

పద్మారావు గొప్పతనమేంటంటే? : తలసాని

Published: Mon,February 25, 2019 11:17 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. పద్మారావుతో తనకున్న అనుబంధం వేరు. పద్మారావు మొదలు రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత నేను రావడం. వెనుకబడిన వర్గాలకు చెందిన తాము.. అంచెలంచెలుగా ఎదిగాం. తామిద్దరం ఒకరికొకరం విమర్శించుకున్న దాఖలాలు లేవు.

1986లో పద్మారావు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2001లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. జంట నగరాల అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అనుకోని విధంగా 2004లో తాను పద్మారావు ఎన్నికల్లో పోటీ పడ్డాం. 2004 ఎన్నికల్లో పద్మారావు గెలవడం, తాను ఓడిపోవడం. మళ్లీ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో తాను గెలవడం, ఆయన ఓడిపోవడం జరిగింది తప్ప తమ ఇద్దరి మధ్య విబేధాలు లేవు అని తలసాని స్పష్టం చేశారు.

2009లో సనత్‌నగర్ నుంచి ఇద్దరం పోటీ చేసి ఓడిపోయామని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో జరిగిన రహస్యం ఏంటంటే.. తామిద్దరం అండర్‌స్టాండింగ్‌తోనే వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచామని తలసాని చెప్పారు. ఆ తర్వాత తాను టీఆర్‌ఎస్‌లో చేరడం జరిగిపోయింది. ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయన్నారు. పద్మారావులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే.. రాజకీయాల్లో నిలకడగా ఉండటం. నిరంతరం ప్రజల మధ్యన ఉండడం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చేశారు. సికింద్రాబాద్ ప్రాంత అభివృద్ధికి ఇద్దరం కలిసి పని చేశామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
4833
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology