
వ్యాపారంలో ఒంటరిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్న స్నాప్డీల్.. వ్యయాలను తగ్గించుకునేందుకు భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్లు తెలుస్తున్నది. సిబ్బందిని 80 శాతం మేర తగ్గించుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నదని సమాచారం. ప్రస్తుతం సంస్థలో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే, వెయ్యి మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. తొలిగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఆయా విభాగాల అధినేతలకు సంస్థ మేనేజ్మెంట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిసింది. గత ఏడాది జూలైలో 9వేలుగా ఉన్న స్నాప్డీల్ సిబ్బంది సంఖ్య ఏడాదికాలంలో పన్నెండు వందలకు తగ్గింది.