ఉద్యమ సూర్యుడు కేసీఆర్ : రసమయి

Fri,April 21, 2017 01:27 PM

-మత్తడి కట్టల కింద కాంగ్రెస్ సమాధి
-బొంబాయికి బస్సులు వేయమనే దుస్థితి ఇప్పడు లేదు
హైదరాబాద్ : పెంచిన కరెంట్ బిల్లులు దించమంటే.. తుపాకీ తూటాలతో కాల్చిచంపిన నరహంతక సమైక్య పాలనకు నిరసనగా తన పదవికి రాజీనామా చేసి ఎద్దు ఎడ్చిన చోట ఎవుసం నిలవదు.. రైతు ఏడ్చిన చోట.. రాజ్యం నిలవదని తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఇక కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ మరణ వాంగ్మూలాన్ని రాసుకొని తెలంగాణను తీసుకువచ్చినటువంటి ఉద్యమ సూర్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు.

టీఆర్‌ఎస్ ప్లీనరీలో సాగునీటి పారుదల, వ్యవసాయం రంగం తీర్మానం ప్రతిపాదించే సందర్భంగా రసమయి మాట్లాడారు. చెరువులు నిండితే పని దొరుకుతదని తన తల్లి చెప్పేదని గుర్తు చేశారు. చెరువు నిండితే సబ్బండ వర్గాలు బాగుపడుతాయని చెప్పేదన్నారు. అది నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. చెరువులు మాయం కావడానికి ప్రధానం.. గత పాలకులే. గట్ల మీద చల్లాల్సిన తుమ్మ చెట్ల విత్తనాలను చెరువుల్లో చల్లారు సమైక్య పాలకులు. ఎందుకంటే చెరువులు నిండితే రైతులు బాగుపడుతారు.

అభివృద్ధి చెందుతారన్న కారణంతోనే సమైక్య పాలకులు విధ్వంసానికి పాల్పడ్డారు. చెరువులను ముళ్ల కిరీటంతో తొక్కించారు గత పాలకులు. వానమ్మా వానమ్మా పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు రసమయి. మొత్తానికి సీఎం మొరను దేవుడు ఆలకించి.. వర్షాలు బాగా పడేలా చేశారు. గత రెండేళ్ల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పారు. 46 వేల చెరువులను పునరుద్ధరించామని తెలిపారు. చెరువుల నిండా నీళ్లను చూస్తుంటే.. కాంగ్రెస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పారు. చెరువులో చేపలు చెంగున ఎగురుతుంటే.. మత్స్యకారుల ముఖాల్లో ఆనందం చెప్పలేనిదన్నారు.

TRS PLENARY 2017 Photo Gallery

అన్ని వర్గాల్లో ఆనందం కనబడుతుంటే.. కాంగ్రెస్, టీడీపీ నేతలకు కమీషన్లు కనబడుతున్నాయని ఎద్దెవా చేశారు. మా ముఖ్యమంత్రికి రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతుందన్నారు. 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని చేసి చూపించిన ఉద్యమ సూరీడు కేసీఆర్ అని తెలిపారు. సీఎం కేసీఆర్ డిక్షనరీలో అపజయం పదమే లేదన్నారు. అసమానతలను అధిగమించి.. తెలంగాణను సాధించుకున్నారని పేర్కొన్నారు. ఈ 34 నెలల కాలంలోనే 70 శాతం ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని గుర్తు చేశారు.

924

More News

మరిన్ని వార్తలు...