లోపం తనలోనే.. సాధనతో 'ఆ' సమస్యను అధిగమించవచ్చు!Mon,July 17, 2017 06:13 PM

 లోపం తనలోనే.. సాధనతో 'ఆ' సమస్యను అధిగమించవచ్చు!

మేడమ్ మా పెళ్ళయి 6 సంవత్సరాలు. మా వారు ఉద్యోగరీత్యా దుబాయ్‌లో ఉంటుంటారు. సంవత్సరానికి రెండు సార్లు వస్తుంటారు. మేం ఇద్దరం శృంగారంలో పాల్గొన్నప్పుడల్లా ఆయనకు క్షణాల్లోనే స్ఖలనం అవుతుంది. దీనివల్ల ఇద్దరం అసంతృప్తికి లోనవుతున్నాము. దీనికి చికిత్స ఏమైనా ఉందా? ఈ సమస్య వల్ల ఆయనకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. ఎందుకంటే, ‘నేను నిన్ను సంతృప్తి పరచనందువల్ల నువు ఎవరితోనో కలుస్తున్నావు, నన్ను మోసం చేస్తున్నావు’ అంటూ వేధిస్తున్నారు. నిజానికి నేను నా అసంతృప్తిని కూడా వెల్లడించను. నాకు బాగానే ఉంది అంటాను, ఆయన్ను బాధ పెట్టడం ఇష్టం లేక. కానీ తను నమ్మరు. దుబాయ్ నుంచి ఫోన్లు చేసి అనుమానంతో వేధిస్తుంటారు. ఏం చెయ్యమంటారు?
- బి.ఎస్., షాయినాత్ గంజ్, హైదరాబాద్

భార్యకు వృత్తిరీత్యా దూరాన వుండే భర్తలలో చాలా రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనడం వల్ల శీఘ్రస్ఖలన సమస్య మొదలవుతుంది. లోపం తనలో పెట్టుకుని మీ భర్త మిమ్మల్ని అనుమానంతో వేధించడం మంచిది కాదు. అతన్ని సెక్సాలజిస్ట్ వద్ద చికిత్స తీస్కోమనండి. అంగస్తంభన కాలాన్ని పెంచే సెక్స్ థెరపీ తీస్కుంటూ రిలాక్సేషన్ టెక్నిక్స్ సాధన చేస్తే శీఘ్రస్ఖలన సమస్య - ఆందోళన తగ్గుతాయి.


సాధనతో ఆ సమస్యను అధిగమించవచ్చు!

దుబాయ్‌లో ఉంటూనే మీ భర్త సాధన చేస్తూ శీఘ్రస్ఖలన సమస్య నుంచి బయటపడవచ్చు. అనుమానిస్తే అతనికి శీఘ్రస్ఖలన సమస్యతోపాటు భయాందోళనల వల్ల, ఒత్తిడి వల్ల అంగస్తంభన సమస్య వస్తుంది. మీరు ఈసారి వచ్చినప్పుడు మనోలైంగిక చికిత్స ఇప్పించండి. అతని అనుమానపు జబ్బుకి కౌన్సెలింగ్ థెరపీ ఇప్పించండి. దుబాయ్‌లో మీకు దూరాన అతను ఉన్నప్పుడు మీరు అతన్ని అనుమానించడం లేదు. మీ భర్త కూడా మీ మీద ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచాలి. అతను తన జబ్బుని తగ్గించుకోవడానికి సెక్స్ థెరపీ, ఫిజియో థెరపీ తీసుకుంటే సరే.... తీస్కోకుండా మిమ్మల్ని అలాగే వేధిస్తే మీరు భరించాల్సిన అవసరం లేదు. అతని సంగతి అతని తల్లిదంవూడులకు, మీ తల్లిదంవూడులకు చెప్పండి. మౌనంగా భరించాల్సిన అవసరం లేదు.

9409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS