పార్దీ గ్యాంగ్‌ సభ్యులు అరెస్ట్‌

Sat,August 17, 2019 05:27 PM

pardee gang members arrested in hyderabad

హైదరాబాద్‌: పార్దీ గ్యాంగ్‌ సభ్యులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేశాం. నిందితుల నుంచి కారు, 60 తులాల బంగారం, రెండు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నాం. పార్దీ గ్యాంగ్‌కు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నది. గత నెల 26వ తేదీన తార్నాకలో ఓ ఇంట్లో దోపిడీ జరిగింది. సాంకేతిక నైపుణ్యం ఆధారంగా దోపిడీ కేసును దర్యాప్తు చేశాం. కేసు దర్యాప్తులో సీసీ కెమెరా పుటేజీ ఉపయోగపడింది. ఈ దోపిడీ కేసులో విచారణ జరుపుతుండగా ముగ్గురు పార్దీ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. నిందితులపై మూడు కమిషనరేట్‌ల పరిధితో పాటు వరంగల్‌, ఆంధ్రప్రదేశ్‌లలోనూ కేసులు ఉన్నాయి. పట్టుబడిన వారు 2004 నుంచి నేరాలు చేస్తున్నారు. నిందితులపై 12 కేసులు నమోదై ఉన్నాయని వివరించారు.

982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles