బ్రెజిల్‌కు బ్యాడ్‌న్యూస్‌.. అత‌డు ఫిట్‌గా లేడు!

Sun,June 17, 2018 12:28 PM

Neymar is not fully fit says Brazil Coach Tite

రొస్తొవ్-ఆన్‌-డాన్‌: గ‌త వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అత‌డు టీమ్‌లో ఉన్నంత వ‌ర‌కు బ్రెజిల్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లింది. అయితే చివ‌రి లీగ్ మ్యాచ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డి మొత్తం టోర్నీకే దూర‌మ‌వ‌డంతో సెమీఫైన‌ల్లోనే ఓడిపోయి ఇంటిదారి ప‌ట్టింది. మ‌ళ్లీ ఈసారి తొలి మ్యాచ్ కూడా ఆడ‌క ముందే నెయ్‌మార్ పూర్తి ఫిట్‌గా లేడ‌న్న వార్త బ్రెజిల్‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్న‌ది. ఆదివారం స్విట్జ‌ర్లాండ్‌తో త‌మ తొలి మ్యాచ్ ఆడ‌నుంది బ్రెజిల్‌. అయితే త‌మ స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మార్ పూర్తి ఫిట్‌గా లేడ‌ని ఆ టీమ్ కోచ్ టిటె చెప్పాడు.

కాలి ఎముక విర‌గ‌డంతో గ‌త ఫిబ్ర‌వ‌రిలో స‌ర్జ‌రీ చేయించుకున్నాడు నెయ్‌మార్‌. వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ముందు కూడా అత‌ను పెద్ద‌గా ఆడింది లేదు. కేవ‌లం రెండు వామ‌ప్ గేమ్స్ మాత్ర‌మే ఆడాడు. ఇప్ప‌టికే అత‌ను వంద శాతం ఫిట్‌గా లేడు.. కానీ అత‌నికున్న అత్యుత్త‌మ శారీర‌క ల‌క్ష‌ణాలు నెయ్‌మార్‌ను ప్ర‌త్యేకంగా నిలుపుతాయి. ముఖ్యంగా అత‌ని స్పీడ్ అద్భుతం. ఆదివారం మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడ‌ని అనుకున్నా. అయినా అత‌ను మ్యాచ్ ఆడే ప‌రిస్థితుల్లోనే ఉన్నాడు అని కోచ్ టిటె వెల్ల‌డించాడు. స్విట్జ‌ర్లాండ్ త‌ర్వాత కోస్టారికా, సెర్బియాల‌తో బ్రెజిల్ ఆడాల్సి ఉంది.

59
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles