రఘుబాబు స్మారక నాటకోత్సవాలు: పరుచూరి

Sun,December 14, 2014 10:32 AM

Raghu Babu Memorial natakotsavalu

Raghu Babu Memorial natakotsavalu


హైదరాబాద్: పరుచూరి రఘబాబు స్మారకంగా నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నాటకోత్సవాలను తెలంగాణ, ఏపీలో ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు రఘబాబు స్మారక నాటకోత్సవాలను నిర్వహిస్తున్నాం.

తెలంగాణలో 4 రోజులు, ఏపీలో 5 రోజులు ఈ కార్యక్రమాల నిర్వహణ. తెలంగాణ మాండలికంలో ప్రయోగానికి ప్రత్యేక బహుమతి. ప్రవేశాలకు తుదిగడువు ఫిబ్రవరి 10. నాటకం కోసం జీవితాన్ని త్యాగం చేసిన 25 మందిని ఈ కార్యక్రమంలో సన్మానిస్తాం. నాటకాలను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. రఘబాబు జ్ఞాపకార్థంగా నాటకోత్సవాలు నిర్వహించడం, ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

1210
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles