అయోధ్యను హిందువులు రామజన్మ భూమిగా భావిస్తారు

Sat,November 9, 2019 11:12 AM

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును చదివివినిపించారు. 'రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి. రెండు మతాలవారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిపేవారని ముస్లింలూ విశ్వసిస్తారు. ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుంది. ఇది పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించింది. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు. మసీదు ఎవరు కట్టారో ఎప్పుడు నిర్మించారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదు. నిర్ణయానికి ముందు 2 మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నాం. మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయి. దేవాలయాన్ని ధ్వంసం చేశారనడానికి పురవాస్తు ఆధారాలు లేవు. 12-16 శతాబ్ధాల మధ్య అక్కడేముందో చెప్పడానికి పురావస్తు ఆధారాలు కూడా లేవు. అయోధ్యను హిందువులు రామజన్మ భూమిగా భావిస్తారని' సీజేఐ వివరించారు.

1428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles