కాళోజీ అంటే వ్యక్తికాదు.. శక్తి దేశపతి

Fri,September 9, 2016 12:55 PM

kaloji narayana rao award meeting at Ravindra Bharathi

రవీంద్రభారతిలో కాళోజీ నారాయణరావు 102వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రజా గాయకుడు గోరేటి వెంకన్నకు కాళోజీ నారాయణరావు 2016 అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కవి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ... కాళోజీ అంటే వ్యక్తికాదు... శక్తి. కాళోజీ మనకాలం వేమన అని కొనియాడారు. కాళోజీ కవిత్వంలో రాజకీయ ప్రకటన చేశారు. కాళోజీ భావనల ప్రతిరూపం నాగొడవ మహాకావ్యం. చరిత్ర గమనానికి కోళోజీ సాక్షి. యమున్ని సైతం ధిక్కరించే ఖలేజా ఉన్న కవి కాళోజీ అని తెలిపారు. పేదల గుండెల దుఃఖాన్ని వినగలిగిన కవి గోరేటి వెంకన్న. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారడానికి కవిగా, వాగ్గేయాకారుడిగా వెంకన్న ఎంతో కృషి చేశారని చెప్పారు.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles