రైలు మిస్సయిందా? డోంట్ వర్రీ!

Fri,May 5, 2017 10:28 AM

Indian railway introduced vikalp scheme

హైదరాబాద్ : మీరు రిజర్వేషన్ చేసుకున్న రైలు మిస్సయిందా? రిజర్వేషన్ చేసుకున్నా బెర్త్ లభించలేదా? అయినా నోప్రాబ్లమ్! అదే టికెట్‌పై అదే గమ్యానికి వెళ్లే ఏ రైలైనా ఎక్కేందుకు భారత రైల్వే అవకాశం కల్పించింది. ఈ మేరకు వికల్ప్ పథకాన్ని తాజాగా ప్రారంభించింది. ఈ పథకం కింద ఒకే గమ్యానికి వెళ్లే
ఏ రైలులోనైనా సాధారణ టికెట్‌తో కూడా ప్రయాణించే అవకాశముంది. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు రైలు మిస్సయితే, అనంతరం అదే మార్గంలో వచ్చే ఏ రైలులోనైనా ప్రయాణించవచ్చు.

ప్రత్యేక రైళ్లలో కూడా..
రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ లాంటి ప్రత్యేక రైళ్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇలా సూపర్ ఫాస్ట్ రైళ్లను వినియోగించుకున్నందుకు ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని భారత రైల్వే వెల్లడించింది. మే1 నుంచి ప్రయాణికులు ఆయా రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తులను వినియోగించుకోవచ్చని సూచించింది. రిజర్వేషన్ వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు కూడా ఆ టికెట్లతో ఖాళీగా ఉన్న రైళ్లలో ప్రయాణించవచ్చని వెల్లడించింది.

వికల్ప్ పథకాన్ని ఎంచుకోవాలి..
ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు టికెట్ బుక్ చేసుకునే సమయంలో వికల్ప్ స్కీంను ఎంచుకోవాలని భారతీయ రైల్వే పేర్కొన్నది. ఒకవేళ వెయిటింగ్ లిస్టులో ఉంటే అదే సమయానికి ఖాళీగా వచ్చే రైలు సమాచారం, ఎస్‌ఎంఎస్ రూపంలో సదరు వ్యక్తి మొబైల్ ఫోన్‌కు వస్తుందని తెలిపింది. కాగా, ఫ్లెక్సీ ఫేర్ సిస్టంను ప్రారంభించిన తర్వాత ప్రీమియర్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. రైల్వే తాజా నిర్ణయంతో లక్షల మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలు కలుగుతుందని ఇండియన్ రైల్వే పేర్కొంది.

7000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles