దేశంలోనే అధికారికంగా రంజాన్ నిర్వహణ: హరీష్

Fri,June 16, 2017 09:52 PM

iftar treat in Siddipet

సిద్దిపేట: దేశంలోనే రంజాన్ పండుగను అధికారికంగా జరుపుతున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌తో పాటు ఎమ్మెల్యే బాబూమోహన్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చనిపోయిన ముస్లింల కోసం ఏర్పాటు చేసిన అఖిరి సఫర్ వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. హిందువులకు వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసినట్లు ముస్లింలకు అఖిరి సఫర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం హరీష్ మాట్లాడుతూ.. రంజాన్ సందర్భంగా 4 లక్షల మందికి ప్రభుత్వం దుస్తులు, పండుగ సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం కేసీఆర్ సిద్దిపేటలో దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. సిద్దిపేటలో షాదీఖానా నిర్మించాం. రాష్ట్ర వ్యాప్తంగా షాదీఖానాలు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని మతాలను భాగస్వాములను చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.

756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles