నేను హోంమంత్రి అయి ఉంటే మేధావులందరినీ...!

Fri,July 27, 2018 02:44 PM

I would have ordered to kill intellectuals if I had been Home minster says Karnataka BJP MLA

బెంగళూరు: కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి మేధావులతో పెను ముప్పు పొంచి ఉన్నదని, తాను హోంమంత్రి అయి ఉంటే వాళ్లందరినీ కాల్చి పారేయమని ఆదేశించేవాడినని అన్నారు. సాధారణ ప్రజలు చెల్లించే పన్నులపై బతుకుతూ.. ఆర్మీకి వ్యతిరేకంగా ఈ మేధావులు నినాదాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మేధావులు ఈ దేశంలో ఉన్న అన్ని వసతులను అనుభవిస్తున్నారు. అయినా మన ఆర్మీకి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. వాళ్ల నుంచి దేశానికి పెను ముప్పు పొంచి ఉంది అని విజయపుర ఎమ్మెల్యే అయిన బసనగౌడ అన్నారు.

ఈ ఎమ్మెల్యే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.

విజయపురలో ఈ ఏడాది జూన్ 4న మాట్లాడుతూ.. కార్పొరేటర్లంతా తమకు ఓట్లేసిన హిందువుల కోసమే పనిచేయాలని, ముస్లిం కోసం వద్దని పిలుపునిచ్చి వివాదం రేపారు. అసలు నా ఆఫీస్‌కు ముస్లింలు రావద్దు. టోపీ, బుర్కా ఉన్న వాళ్లు నా దగ్గరికే రాకూడదని అని మా వాళ్లకు ఆదేశాలిచ్చాను అని గతంలో బసనగౌడ అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఈయన సహాయమంత్రిగా కూడా పనిచేశారు. 2010లో జేడీఎస్‌కు వెళ్లి 2013లో మరోసారి బీజేపీ గూటికి చేరారు.

1999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles