ఆ వీడియోను 8 కోట్ల మంది చూశారు !!Tue,May 9, 2017 04:59 PM

How to make ice cubes at home video gets 80 Million views

ఈ మ‌ధ్య గాసిప్స్‌, పేర‌డీలు, వ‌దంతులను జ‌నం బాగా న‌మ్ముతున్నారు. ఈ టైపు వీడియో అయినా.. న్యూసైనా తెగ చూసేస్తున్నారు. ఇట్లాంటిదే ఓ వీడియో. అందులో ఏమీ లేదు. జ‌స్ట్ ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఎలా త‌యారు చేస్తారు అనేది ఆ వీడియోలో చూపించారు. ఇంట్లో మ‌నం ఫ్రీజ్‌లో ఐస్ క్యూబ్స్ త‌యారుచేయ‌డ‌మ‌న్న‌మాట‌. హోమ్ మేడ్ ఐస్ క్యూబ్స్ ఎలా త‌యారు చేస్తారు అనే పేరుతో గార్నిష్డ్ అనే సంస్థ ఈవీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టింది. అంతే.. జ‌నం దాన్ని ఎగ‌బ‌డి చూశారు. మ‌రి అదో వంట‌క‌మ‌ని పొర‌బ‌డి చూశారా? లేక అంత మందికి ఐస్ క్యూబ్స్ త‌యారు చేయ‌డం రాదా? అన్న‌ది సందేహం. గార్నిస్డ్ అనేది ఫేస్‌బుక్‌లో వంట‌కాల‌కు సంబంధించిన పేజీ. స‌రికొ్త్త రెసీపీలు ఎలా త‌యారు చేయాలో ఎప్ప‌టిక‌ప్పుడు వీడియోల రూపంలో ఈ పేజీలో అప్‌లోడ్ చేస్తుంటారు. ఐస్ క్యూబ్స్ ఎలా త‌యారు చేయాలో మీకూ తెలియ‌క పోతే ఇదిగో అదే.. ఆ వీడియోను మీరూ చూడొచ్చు.

7223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS