టీఆర్‌ఎస్ పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిని : హరీశ్‌రావు

Tue,February 19, 2019 12:29 PM

harish rao wishes to new telangana ministers

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర మంత్రివర్గానికి హరీశ్‌రావు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి ఆలోచనలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసి ఈ ప్రభుత్వానికి, కేసీఆర్‌గారికి మంచిపేరు తీసుకొస్తారని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ రోజు గౌరవనీయులు కేసీఆర్‌గారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి ప్రజల ఆకాంక్షలను నిజం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు పూర్తిస్థాయిలో మంచిగా పనిచేసి ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉండి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాని తెలిపారు.

ఎన్నికల సమయంలో కూడా చెప్పాను, నేను టీఆర్‌ఎస్ పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేస్తున్నాను. పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి సీఏం కేసీఆర్‌ ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని ఇప్పటికే పదుల సార్లులో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగారు ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాలు, సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. నాకు వారు ఏ భాధ్యత అప్పగించినా క్రమశిక్షణగల కార్యకర్తగా దానిని అమలు చేస్తాను. నాకు అసంతృప్తి ఉండటం కాని అటువంటిది ఏదీ కూడా ఉండదు. ఎవరైనా సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరుమీద ఎటువంటి గ్రూపులు, సేనలు లేవు. ఎవరైనా పెట్టుకుంటే దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని, అందరూ పార్టీ కోసం, సీఎం కేసీఆర్ కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

6474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles