హార్దిక్ పటేల్‌ను విడుదల చేయాలి

Sat,December 26, 2015 12:35 AM

Hardik Patel to be released

-ఇద్దరు పాటిదార్ నేతల నిరాహార దీక్ష
అహ్మదాబాద్, డిసెంబర్ 25: జైలులో ఉన్న పటేల్ రిజర్వేషన్ కోటా ఉద్యమ నేత హార్దిక్‌పటేల్‌తోపాటు ఇతర సభ్యులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్)కి చెందిన ఇద్దరు సభ్యులు ఆందోళనకు దిగారు. అహ్మదాబాద్‌లో, సూరత్‌లలో వారి ఇండ్ల వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. విజల్‌పూర్ ప్రాంతానికి చెందిన రేష్మా పటేల్ తన నివాసంలో డిసెంబర్ 21 నుంచి నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. హార్దిక్‌తోపాటు ఆరుగురు పాస్ నేతలను విడుదల చేయడంతోపాటు వారిపై మోపిన దేశద్రోహం కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కొన్నిరోజులుగా వారు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

404
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS