ఆర్థికమంత్రి ఈటలకు పలువురి శుభాకాంక్షలు

Tue,January 3, 2017 01:16 AM

Greetings to the officers of the transport minister Mahender Reddy

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆర్థికశాఖ కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, సందీప్‌కుమార్ సుల్తానియా, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, పౌర సరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్, సీఆర్వో బాల మాయాదేవి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్, ఆంజనేయులు మంత్రి ఈటలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

రవాణా మంత్రి మహేందర్‌రెడ్డికి అధికారుల గ్రీటింగ్స్
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డికి పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. సోమవారం ఆయన కార్యాలయానికి చేరుకున్న టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తదితరులు మంత్రిని కలిసి గ్రీటింగ్స్ తెలిపారు. వీరితో కలిసి మంత్రి కే మహిందర్‌రెడ్డి కేక్ కట్ చేశారు.

513
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles