ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు

Thu,August 30, 2018 04:21 PM

funeral rites of Harikrishna at Jubleehills Mahaprasthanam

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య హరికృష్ణ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. హరికృష్ణ చితికి ఆయన రెండో కుమారుడు కల్యాణ్‌రామ్ నిప్పటించారు. మెహిదీపట్నం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. హరికృష్ణ అంత్యక్రియల్లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమయాత్రలో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

5601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS