ఈ పరీక్ష కోసం విమానాలు రద్దు చేశారు..!

Thu,November 15, 2018 03:07 PM

Flights suspended and Public offices stock markets opened an hour late for an exam

ఒక పరీక్ష కోసం ఇంత ప్రాధాన్యతా?.. ఆ దేశంలోని యంత్రాంగమంతా దిగొచ్చి పరీక్ష ఏర్పాట్లలో పాల్గొన్నారు... ప్రభుత్వమే కాదు ప్రజలు తమవంతు సహకారాన్నందించారు. పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలు, దుకాణాలు ఒక గంట ఆలస్యంగా తెరుచుకున్నాయి... విమాన సర్వీసులను 25 నిమిషాలపాటు నిలిపివేశారు.. ఇంతకీ ఏంటీ ఆ పరీక్ష, ఎక్కడ జరిగింది?..

సియోల్: ఓ పరీక్ష కోసం 134 విమానాలను 25 నిమిషాల పాటు రద్దు చేశారు. ఇతర వ్యాపారాలు, స్టాక్‌మార్కెట్లను గంట ఆలస్యంగా ప్రారంభించారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా చూశారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పరీక్ష కావడంతో అసాధారణ చర్యలు తీసుకున్నారు. ఏకంగా దేశాధ్యక్షుడే విద్యార్థులకు బెస్టాఫ్ లక్ చెప్పారు. ఇంత ముఖ్యమైన పరీక్షకు వేదికైంది సౌత్ కొరియా. ఇక్కడ ప్రతి ఏటా జరిగే నేషనల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ పరీక్షపై ఆధారపడి ఉంటాయి. ఈసారి కూడా 5 లక్షల 95 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మంచి యూనివర్సిటీల్లో అనుకున్న కోర్సులో సీటు సాధించి తద్వారా మంచి సామాజిక హోదా, ఉద్యోగాలు పొందడానికి సౌత్ కొరియాలో ఈ పరీక్షే కీలకం. ఇంతటి కీలకమైన పరీక్ష కాబట్టే దీనిని సుమారు 9 గంటల పాటు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అసాధారణ చర్యలు తీసుకుంటారు.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ మార్కెట్, ఇతర వ్యాపారాలను గంట ఆలస్యంగా ప్రారంభించారు. సౌత్ కొరియా స్థానిక కాలమాన ప్రకారం గురువారం ఉదయం 8.40 గంటలకు ఈ పరీక్ష ప్రారంభమైంది. ఎవరైనా విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే వాళ్లను సరైన సమయానికి ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా పోలీసు కార్లు, మోటార్‌బైకులు ఏర్పాటు చేశారు. ఇక పరీక్ష రాసే సమయంలో విద్యార్థుల ఏకాగ్రత చెదరకుండా ఉండేందుకు అన్ని సౌత్ కొరియా ఎయిర్‌పోర్ట్‌లలో 25 నిమిషాల పాటు అన్ని విమానాల టేకాఫ్స్, ల్యాండింగ్స్‌ను నిలిపేశారు. ఆ 25 నిమిషాల పాటు పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఇంగ్లిష్ లిజనింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 134 విమానాలను పరీక్ష కారణంగా రీషెడ్యూల్ చేశారు. ఈ పరీక్ష ఫలితాలు డిసెంబర్ 5న వెలువడనున్నాయి.

2049
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles