ప్రముఖ కార్టూనిస్టు థామస్ కన్నుమూత

Fri,April 29, 2016 12:25 AM

Famous cartoonist Thomas passes away

కొట్టాయం, ఏప్రిల్ 28: బొబన్-మోలీ బొమ్మల (కామిక్) పుస్తకాన్ని రూపొందించి చిన్నారుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ మలయాళ కార్టూనిస్టు వీటీ థామస్ (87) గురువారం కొట్టాయంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇక్కడి ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. 1961లో మలయాళ మనోరమలో కార్టూనిస్టుగా తన వృత్తిని ప్రారంభించిన థామస్.. 1987లో ఉద్యోగ విరమణ చేసేవరకూ అదే సంస్థలో పనిచేశారు. బొబన్-మోలీ పేరుతో ఆయన వేసిన బొమ్మల కథలు మలయాళ మనోరమ వారపత్రికలో చివరి పేజీలో ప్రచురితమయ్యేది. ఆ బొమ్మల కథకోసమే ఆ పుస్తకాన్ని చాలా మంది కొనేవాళ్లు.

1082
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS