గవర్నర్, కేంద్ర హోంమంత్రి కార్యాలయం పేరిట నకిలీ దస్ర్తాలు

Sat,December 17, 2016 06:55 PM

హైదరాబాద్: గవర్నర్, కేంద్ర హోంశాఖ కార్యాలయం పేరిట నకిలీ దస్ర్తాలు సృష్టించారు. సైనిక్‌పురికి చెందిన రాఘవరావును ఈ కేసులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చినట్లు దస్ర్తాలు సృష్టించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు దస్ర్తాలు సృష్టించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుంటూరుకు చెందిన రఘువంశి కోసం సీఐడీ అధికారులు గాలిస్తున్నారు. ఉత్తర్వులు ఎందుకు అమలు చేయడం లేదని గవర్నర్ కార్యాలయానికి నిందితుడు సహ చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నర్ కార్యాలయం ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles