గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతి

Tue,June 4, 2019 04:37 PM

Ex MLA gattu bheemudu dies after heart attack

జోగులాంబ గద్వాల : గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గుండెపోటుతో మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1999లో భీముడు మొదటిసారి గద్వాల నియోజకవర్గం టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గట్టు భీముడు మృతిపట్ల గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. భీముడు మృతి నేపథ్యంలో పరిషత్ ఎన్నికల సంబురాలను చేసుకోవద్దు అని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృష్ణమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

2534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles