వర్షపు నీటిని ఒడిసి పడుతూ విద్యుత్ ఉత్పత్తి!

Sun,March 19, 2017 07:23 AM

electricity produce with rain water

ఈ రోజుల్లో కళ్లముందు ఏం జరుగుతున్నా, ఎలాంటి నష్టం వాటిల్లుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మనకెందుకు అనుకుంటున్నారు. కానీ ఈ దంపతులు పదిమందికి పనికొచ్చే ఆలోచన చేశారు. అంతటితో ఆపకుండా ఆచరణలో పెట్టారు. ప్రియా వకీల్, సమిత్‌లు ఒక కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని వృథా చేయకుండా గొడుగు రూపంలో ఒక వస్తును తయారు చేశారు. ఇది వర్షపు నీటిని భూమి లోపలికి పంపిస్తుంది. పైన ఏర్పాటు చేసిన సోలార్ బోర్డులు సౌరశక్తిని సేకరించి కరెంట్ ఉత్పత్తి చేస్తాయి. అసలే ఎండాకాలం భూగర్భ జలాలు ఎండిపోతాయి. పవర్‌కట్‌లు అత్యధికంగా ఉంటాయి. ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా ఈ ఆవిష్కరణ చేశారు. దీనివల్ల వర్షాకాలంలో ఈ గొడుగు ద్వారా వర్షపు నీరు ఇంకుడుగుంతలోకి వెళ్తుంది.

వీరిద్దరూ గ్రీన్ టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించి రేపటి తరానికి పనికొచ్చే వస్తువులను తయారు చేయాలనుకుంటున్నారు. గొడుగులకు అల్ట్రా చాటా అని పేరు పెట్టారు. దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రదేశాల్లో వీటిని అమర్చారు. వీటివల్ల నీటి లభ్యతను పొందటంతో పాటు 1.5 కిలోవాల్ట్‌ల కరెంట్‌ను ఉత్పత్తి చేయొచ్చని చెప్తున్నారు. అల్ట్రా చాటాలను ఏర్పాటు చేయాలంటే ఒక్కోదానికి చదరపు అడుగు స్థలం అవసరమవుతుంది. ప్రియా సస్టేనబుల్ డిజైన్‌లో మాస్టర్స్ చదివింది. ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి చేసింది. తన ఐడియాకు భర్త ప్రోత్సాహం తోడవడంతో ఈ ప్రాజెక్ట్ బయటికి వచ్చిందంటున్నారు ప్రియా. థింక్‌పై అనే గ్రూప్‌ను స్థాపించి పర్యావరణ ప్రేమికులను ఏకతాటిపై తీసుకొస్తున్నారీ దంపతులు.

2446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles