భూమికి భగభగలు తప్పవా?

Tue,August 7, 2018 04:46 PM

earth going to be a hothouse

మనం ఎటుపోతున్నాం? అనే ప్రశ్నకు అగ్నిగుండంలోకి అని సమాధానమిస్తున్నారు శాస్త్రవేత్తలు. అసలు భూతాపం అనేదే పెద్ద భ్రమ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటివారు కొట్టిపారేస్తారు. కానీ ప్రపంచదేశాలు ఆ మధ్య కుదుర్చుకున్న వాతావరణ మార్పుల ఒప్పందం ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నా.. భూతాపం పెరుగుదలను అవి కూడా ఆపలేవని స్టాక్‌హోం రెజిలెన్స్ సెంట‌ర్‌ యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, పోస్డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ైక్లెమేట్ రిసెర్చ్ సంయుక్త బృందం తేల్చింది.

ఈ బృందం నివేదిక స్వీడన్ జాతీయ శాస్త్ర పరిశోధనల సంస్థ ప్రచురించింది. ఒకటి తర్వాత ఒకటిగా గొలుసుకట్టు చర్యలు సంభవిస్తాయని, దానివల్ల భూతాపం పెరిగి భూమి నివాసయోగ్యత ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం యూరప్‌ను మాడుస్తున్న అసాధారణమైన మండేఎండలు ఒక హెచ్చరిక మాత్రమేనని బృంద సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. అంటే కేవలం గ్రీన్‌హౌజ్ వాయువుల విడుదలను తగ్గించడం మాత్రమే సరిపోదు. అడవులు పెరగాలి. వ్యవసాయం, భూయాజమాన్యం మెరుగుపడాలి. జీవవైవిధ్యాన్ని కాపాడాలి. అంతిమంగా కార్బన్ డైఆక్సైడ్‌ను వాతావరణంలో నుంచి తొలగించి భూమిలో నిక్షిప్తం చేసే టెక్నాలజీ రావాలి అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

3856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles