చెప్పుకోలేని ప్లేస్ లో గ్లాస్ క‌ప్ ఇరుక్కుపోయింది!

Fri,September 8, 2017 07:31 PM

Doctors Find Glass Cup Inside Man unexpected place

చైనా అత‌డి రోద‌న అంతా ఇంతా కాదు... వ‌ర్ణ‌ణాతీతం. అత‌డి అరుపుల‌కు హాస్పిట‌ల్ ద‌ద్ద‌రిల్లిపోయింది. ఎందుకంటే.. ఆ వ్యక్తి బాధ అటువంటిది. చెప్పుకోలేని బాధ‌. చైనా లోని షాంగైకి చెందిన ఓ వ్య‌క్తి ఒక రోజు అర్ధ‌రాత్రి రెండు గంట‌ల‌కు హాస్పిట‌ల్ కు ప‌రిగెత్తుకొచ్చాడు. భ‌రించ‌లేని నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. వెంట‌నే డాక్ట‌ర్లు ఎక్స్ రే తీసి షాక్ కు గుర‌య్యారు.

ఎందుకంటే.. అత‌డి విస‌ర్జ‌న మార్గంలో గ్లాస్ క‌ప్ ఇరుక్కుపోయి ఉంది. దాదాపు 8 సెంటీమీట‌ర్ల పొడ‌వు ఉన్న గాజు గ్లాస్ అది. వెంట‌నే ఆప‌రేష‌న్ చేయ‌క‌పోతే ఆ వ్య‌క్తి మ‌ర‌ణించే అవ‌కాశాలు ఉండ‌టంతో అతి క‌ష్టం మీద ఆప‌రేష‌న్ చేయాల‌ని నిర్ణయించారు. ముందుగా వెన‌క భాగం నుంచి ఆ గ్లాస్ ను బ‌య‌టికి తీయ‌డానికి వైద్యులు ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. అది స్లిప్ అవుతూ.. ప‌ట్టు దొర‌క‌క పోవ‌డంతో క‌డుపు ను కోసి దాన్ని బ‌య‌టికి తీసి అత‌డి ప్రాణాల‌ను నిల‌బెట్టారు డాక్ట‌ర్లు. అయితే.. అస‌లు అది ఎలా లోప‌లికి వెళ్లింద‌ని డాక్ట‌ర్లు ఎంత అడిగినా.. ఆ వ్య‌క్తి మాత్రం అస్స‌లు నోరు విప్ప‌లేద‌ట‌.

8659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS