కార్పొరేట్ పాఠశాలకు దీటుగా సర్కారీ స్కూళ్లలో చదువులు

Sun,October 30, 2016 06:33 AM

digital classrooms in telangana government schools

ప్రభుత్వ పాఠశాలు త్వరలో కార్పోరేట్ స్కూళ్లను తలపించనున్నాయి. సర్కారీ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం ప్రయోగాత్మకంగా డిజిటల్ క్లాస్ రూమ్‌లకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 పాఠశాలల్లో నవంబర్ 14 (బాలల దినోత్సవం రోజు)న డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించిన సంగతి తెలిసిందే. భాగంగా జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాల్లోని నాలుగు మండలాల స్కూళ్లను తొలుత ఎంపిక చేసింది. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లు ప్రవేశపెట్టేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విద్యా బోధనకు అసరమైన స్మార్ట్‌ఫోన్, ప్రొజెక్టర్, కంప్యూటర్, స్కానర్, ఇంటర్‌నెట్, ఫర్నీచర్, ఇతర వాటిని సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా పరిధిలోని హైస్కూళ్లకుగాను ఎంపిక చేసిన స్కూళ్లలో డిజిటల్ క్లాస్‌లు ప్రవేశపెట్టనున్నారు. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు హిందీ మినహా ఐదు సబ్జెక్టులను ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన సబ్జెక్టు కంటెంట్‌ను విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధించనున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, మన టీవీ ద్వారా డిజిటల్ తరగతులపై శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తానికి కాలానుగుణంగా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. దశల వారీగా అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పిల్లల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ తరగతులు ఎంతగానో దోహదపడనున్నాయి.

వారానికి ముందుగానే రెడీ
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబరు 14న జిల్లాలోని 33ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కంప్యూటర్ ల్యాబ్‌లు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. ప్రభుత్వం అందించే హార్డ్‌డిస్క్‌ల ద్వారా బోధన అందిస్తాం. డిజిటల్ క్లాసులు ప్రారంభించే పాఠశాలల్లో టీచర్లకు అవసరమైన శిక్షణ నవంబర్ 10లోగా పూర్తి చేస్తాం. ఇంటర్నెట్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చిన శాబ్ కేబుల్ నిర్వాహకులతో సంప్రదింపులు జరిపాం. దీంతోపాటు కోఆర్డినేటర్లతో సమీక్షించి ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ఈ పాఠశాలల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, మన టీవీ ద్వారా డిజిటల్ తరగతులపై శిక్షణ ఇవ్వనున్నాం.

1681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles