కేంద్రం ప్రశంసలు రాష్ట్ర బీజేపీకి కనిపించట్లేదు : కడియం

Thu,January 18, 2018 03:18 PM

deputy chief minister kadiyam srihari fire on State BJP leaders

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా పథకాలను కేంద్రం ప్రశంసిస్తుంటే...రాష్ట్ర బిజెపి నేతలు విమర్శిస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలంగాణ విద్యా పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేబ్ సమావేశంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కొత్త సంస్థలు ఇస్తూ...తెలంగాణకు ఇవ్వకపోవడం పక్షపాతం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ఇస్తూ తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం.

తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందని కేబ్ సమావేశంలోనే చెప్పాను. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటేటా విద్యకు కేటాయింపులు తగ్గుతున్నాయి. విద్యాశాఖకు కేంద్రం నిధులు పెంచాల్సిన అవసరముందని విద్యాశాఖ మంత్రులంతా అన్నారు. రాష్ట్రానికి కొత్త సంస్థలు కేంద్రం ఇవ్వడం లేదంటే బిజేపి లక్ష్మణ్ బాధపడ్డారు...మరి కొత్త సంస్థలు తీసుకురావడంలో బీజేపీ నేతలు తమ పలుకుబడి ఉపయోగించాలని హితవు పలికారు. డ్రాపవుట్స్ లో దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్ర సగటు చాలా తక్కువ. తెలంగాణ వచ్చిన తర్వాత డ్రాపవుట్స్ తగ్గాయి. విద్యార్థుల నమోదు పెరిగింది.

స్కూళ్లు మూసివేత, విలీనం లేనేలేదు..ఉంటే ఎక్కడో చెప్పాలని సవాల్ విసిరారు. 40వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా ఖాళీగా లేవు...ఉంటే ఏ లెక్కనో చూపించాలి. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహ్ములు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు అందరూ టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

2584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles