బందిపోటు దొంగ జంగా రాఘవరెడ్డి

Tue,November 13, 2018 01:21 PM

Congress rebels fire on TPCC

- తాబేదార్ల కోసం పార్టీ ప్రతిష్ఠ భ్రష్టుపట్టిస్తున్నారు
- టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్‌రెడ్డి ఆగ్రహం

రాయపర్తి :బీహార్ నేరస్థులు, ఉత్తరప్రదేశ్ బందిపోట్ల కంటే అత్యంత ప్రమాదకరమైన దొంగ వరంగల్ మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బిల్లా సుధీర్‌రెడ్డి ఆరోపించారు. డీసీసీబీని దోపిడీ చేసిన దొంగ జంగా అన్నారు. సోమవారం వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు టీపీసీసీ నాయకులు తమ తాబేదార్లను నిలుపాలన్న లక్ష్యంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అపార అనుభవం కలిగిన కాంగ్రెస్ చరిత్రను భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆర్థిక నేరగాడుగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కేసులు నమోదు చేసుకున్న క్రిమినల్ రాఘవరెడ్డి అని చెప్పారు. ఈ విషయాన్ని మీడియా, కార్యకర్తల సహకారంతో తాను, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులంతా అధిష్ఠానానికి తెలియజేసినా.. జంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. జంగా రాఘవరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని, శ్రేణులంతా పార్టీకి దూరంకాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి నేర చర్రితను వివరిస్తూ 12 పేజీలతో కూడిన ప్రత్యేక బ్రోచర్‌ను బిల్లా సుధీర్‌రెడ్డి విడుదలచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మరోమారు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాయపర్తి గ్రామ మాజీ సర్పంచ్ అయిత ఉప్పలయ్య, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు పోగులకొండ వేణు, మండల నాయకులు బల్లెం పవన్‌కుమార్, మహ్మద్ మన్నన్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

2252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles