
కేసీఆర్ 63వ పుట్టిన రోజును నిర్వహించిన లండన్ ఎన్నారై టీఆర్ఎస్ శాఖ63 రకాల పూలతో దుర్గాదేవికి ప్రత్యేక పూజలులండన్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను లండన్లో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ శాఖ లండన్ ఇన్ఛార్జి సతీష్ రెడ్డి బండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆ శాఖ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఆయన సతీమణి ప్రభలత కూర్మాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వెస్ట్ లండన్లో ఉన్న దుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ 63వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా వారు 63 రకాల పువ్వులతో దేవికి పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి అందరూ సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం, సతీష్ రెడ్డి బండలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే క్రమంలో ఆయన్ను భగవంతుడు చల్లగా చూడాలని కోరుకున్నారు. ఆయనకు దీర్ఘాయువు కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలని ఉండాలని ఆకాంక్షించారు. కేవలం లండన్లోనే కాకుండా ప్రతి సంవత్సరం రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సారి వరంగల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ వేడుకల్లో ఎన్నారై టీఆర్ఎస్ శాఖ కార్యదర్శి సృజన రెడ్డి చాడ, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, సలహాదారు బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సృజన్ రెడ్డి , మీడియా ఇన్చార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే, ఈయూ ఇన్చార్జ్ విక్రమ్ రెడ్డి, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల , ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి , నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ రవి ప్రదీప్, వెస్ట్ లండన్ ఇన్చార్జ్ గణేష్ పాస్తం, సురేష్ బుడగం , మెంబర్ షిప్ ఇన్చార్జ్ రాకేష్ రెడ్ కీసర, ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని, అశోక్ కుమార్ అంతగిరి, టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, టాక్ సభ్యులు స్వాతి బుడగం, మట్టా రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ మేకల తదితరులు పాల్గొన్నారు.