సెప్టెంబ‌ర్ 8 నుంచి కార్టూన్ ఎగ్జిబిష‌న్‌

Fri,August 31, 2018 04:52 PM

Cartoon exhibition by Mrityunjay from September 8th in Bangalore

మ‌నం ఓ సంఘ‌ట‌ను చూస్తాం. ఓ అభిప్రాయానికి వ‌స్తాం. కానీ కార్టూనిస్టు త‌న చేతి వేళ్ల‌తో ఓ అద్భుతం సృష్టిస్తాడు. ఆ ఆలోచ‌న‌కు ఒక స్పార్క్ ఇస్తాడు. కార్టూన్ లేదా క్యారికేచ‌ర్ వేయ‌డం గొప్ప క‌ళ‌. రాజ‌కీయ‌, సామాజిక అంశాల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా, చ‌తురంగా వ్య‌క్తం చేయ‌డం కార్టూనిస్టుల‌కే సొంతం. ఓ బొమ్మ‌ను వేసి వాళ్లు మ‌న మ‌నసుల‌ను క‌దిలింప‌చేస్తారు. చురుకైన కార్టూన్‌తో మ‌న‌లో న‌వ్వును ర‌ప్పిస్తారు. విశ్లేష‌ణ త‌త్వాన్ని మ‌న‌లో క‌లిగిస్తారు. రోజూ జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను తమ శైలితో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే విధంగా కార్టూన్లు వేస్తారు. న‌మ‌స్తే తెలంగాణ‌ దిన‌ప‌త్రిక‌లో కార్టూనిస్టుగా చేస్తున్న చిలువేరు మృత్యుంజ‌య కార్టూన్లు కూడా ఇలాగే ప్ర‌త్యేక‌మైన‌వి.

కార్టూనిస్టు మృత్యుంజ‌య అనేక క‌ళ‌ల్లో నిష్ణాతుడు. డిజిట‌ల్ పేయింటింగ్‌, స్కెచింగ్‌లోనూ ఆయ‌న‌కు విశిష్ట గుర్తింపు ఉన్న‌ది. రాజ‌నీతి శాస్త్రంలో పీజీ చేసిన మృత్యుంజ‌య‌.. త‌న తండ్రి నుంచి కొన్ని క‌ళ‌లు నేర్చుకున్నాడు. తండ్రి చిలువేరు రామ‌లింగం చేనేత వ‌స్త్ర‌ నిపుణుడు. మ‌గ్గంపై తండ్రి వేసే అద్భుతాల నుంచి ప్రేర‌ణ పొందిన మృత్యుంజ‌య‌.. ఆ స్ఫూర్తితోనే త‌న‌లో కార్టూన్ క‌ళ‌కు ప్రాణం పోశారు. ఇప్పుడు ఆయ‌న తేలికైన కార్టూన్‌ రేఖ‌ల‌తో ఎన్నో భార‌మైన భావాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

అసాధార‌ణ‌ కార్టూన్‌ క‌ళ క‌లిగిన మృత్యంజ‌య‌ ఇప్పుడు త‌న ప్ర‌తిభను మ‌రింత విశ్వ‌వ్యాప్తం చేయ‌నున్నారు. ఆయ‌న వేసిన కార్టూన్లు, క్యారికేచ‌ర్లతో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క‌ ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ ఈ ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటు చేస్తోంది. సెప్టెంబ‌ర్ 8వ తేదీన మృత్యంజ‌య కార్టూన్ ప్ర‌ద‌ర్శ‌న ప్రారంభంకానున్న‌ది. బెంగుళూర్‌లోని ట్రినిటీ స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న మిడ్‌ఫోర్డ్ హౌజ్‌లో ఈ ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది. సెప్టెంబ‌ర్ 22 వ‌ర‌కు జ‌రిగే ఈ ఎగ్జిబిష‌న్‌లో.. కార్టూనిస్టు మృత్యుంజ‌య వేసిన అనేక కార్టూన్లు, క్యారికేచ‌ర్లు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. మింత్రా హూప్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌వీన్ శాస్త్రి ఈ కార్య‌క్ర‌మాన్ని ఆవిష్క‌రిస్తారు.

కేర‌ళ‌, బెంగుళూరులో వ‌ర్క్‌షాపుల్లో ఆయ‌న పాల్గొన్నారు. చైనా, బ్రెజిల్‌, రొమేనియా, ట‌ర్కీ, ఇట‌లీ లాంటి దేశాల్లో మృత్యుంజ‌య కార్టూన్లు ఎగ్జిబిష‌న్‌లో పెట్టారు. కార్టూన్ రంగంలో అత్యుత్త‌మ అవార్డులు ఎన్నో అందుకున్నారు. గ్రీస్ దేశం ఎక్స‌లెన్స్ అవార్డుతో సత్క‌రించింది. చైనా నుంచి బెస్ట్ కార్డూనిస్టు అవార్డు స్వీక‌రించారు. నేష‌న‌ల్ ఎయిడ్స్ కార్టూనిస్టు పోటీలో మొదటి స్థానంలో నిలిచారు. పొలిటిక‌ల్ కార్టూన్ కాంటెస్ట్‌లో మ‌యాకామ‌త్ మెమోరియ‌ల్ అవార్డును అందుకున్నారు.

1612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles