వీడియో: ప్రాణాల‌కు తెగించిన పోలీస్

Thu,June 15, 2017 04:27 PM

Brave Police Officer Risks his Life to Catch Truck Driver

అచ్చం సినిమాల్లో వ‌చ్చే చేజ్ సీన్ల‌లాగానే... పాకిస్థాన్ లోనూ ఓ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ ట్ర‌క్కు ఓ వ్య‌క్తిని ఢీకొన్న‌ది. ఆ ట్ర‌క్కు డ్రైవ‌ర్ ట్ర‌క్కును ఆప‌కుండా వెళ్లాడు. వెంటనే ఓ పోలీస్ ఆఫీస‌ర్ ట్ర‌క్కును ఫాలో చేసి ట్రక్కు ముందు ఎక్కాడు. పోలీస్ ట్ర‌క్కు ఎక్కాడ‌నే భ‌యంతో ట్ర‌క్కును ఇంకాస్త స్పీడ్ తో తీసుకెళ్లాడు ట్ర‌క్ డ్రైవ‌ర్. అయినా.. పోలీస్ ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ట్ర‌క్ పై అలాగే నిల‌బ‌డ్డాడు. కొంత‌దూరం వెళ్లాక‌.. ముందు ట్రాఫిక్ జామ్ అవ్వ‌డంతో ట్ర‌క్కును ఆప‌క త‌ప్ప‌లేదు ట్ర‌క్ డ్రైవ‌ర్ కు. వెంట‌నే డ్రైవ‌ర్ ను అదుపులోకి తీసుకున్నాడు ఆ పోలీసు. ఇక‌.. అచ్చం సినీ ఫ‌క్కీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను ట్ర‌క్కు వెన‌కే బైక్ పై వ‌స్తున్న ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక‌.. ప్రాణాల‌కు తెగించి మ‌రీ...త‌ప్పు చేసిన డ్రైవ‌ర్ ను ప‌ట్టుకున్న‌ పోలీస్ పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

2837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles