కళాశాలల్లోనూ బయోమెట్రిక్ విధానం అమలు

Mon,October 24, 2016 01:13 PM

Biometric attendance for junior college students

ప్రభుత్వ కార్యాలయాల్లో, పట్టణాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఉపయోగించే బయోమెట్రిక్ విధానం ఇప్పుడు మారుమూల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైతం అమల్లోకి వచ్చింది. దీంతో ఇక మీదట ఉపాధ్యాయులు గానీ, విద్యార్థులు గానీ డుమ్మా కొడుదామంటే కుదరదు. ఈ విధానం అమలుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఒక మేరకు ఉపాధ్యాయుల అలసత్వానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ విధానం ప్రవేశ పెట్టడం ద్వారా తమ పిల్లలు కళాశాలకు వెళ్తున్నారా? లేదా అనేది తెలిసిపోతుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బయోమెట్రిక్ విధానంతో ఏ రోజు విద్యార్థులు ఎంతమంది హాజరవుతున్నారు అనే వివరాలు ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో నమోదవుతాయి. అలాగే, త్వరలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెడితే ఈ బయోమెట్రిక్ విధానం ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ విధానంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించాల్సి వస్తుంది. ఉత్తీర్ణత శాతం కూడా పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

అలాగే, కళాశాల ఆవరణతోపాటు ఉపాధ్యాయుల విశ్రాంతి గది, ప్రిన్సిపాల్ గదిలో సీసీ కెమెరాలను కూడా ప్రభుత్వం అమర్చింది. మారుమూల గ్రామాల్లోని జూనియర్ కళాశాలల్లో ఎప్పుడు ఏం జరిగినా వెంటనే జిల్లా అధికారులతో పాటు, హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో తెలిసేలా సీసీ పుటేజీల ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఈ బయోమెట్రిక్ విధానం అమలుతో విద్యావ్యవస్థ గాడిన పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

1955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles