సీఎం కేసీఆర్ సోద‌రి లీల‌మ్మ‌ మృతికి చంద్రబాబు సంతాపం

Mon,August 6, 2018 02:22 PM

AP CM Chandrababu Naidu Expressed His Condolence Over Demise Of Leelamma

అమరావతి: తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరి లీలమ్మ మృతిపట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. లీల‌మ్మ‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లీల‌మ్మ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుణ్ని ప్రార్థిస్తున్నాన‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.

1046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles