దునియాలో ఇంత‌క‌న్నా పెద్ద క‌ష్ట‌ముండ‌దేమో..!!Tue,September 12, 2017 02:45 PM

Anand Mahindra tweeted video goes viral on social media

ఇదిగో కింద వీడియో చూడండి.. చూసిన త‌రువాత మీరే చెప్పండి.. ఈ ప్ర‌పంచంలో ఇంత‌క‌న్నా పెద్ద క‌ష్ట‌ముండ‌దేమో అనిపిస్తుంది క‌దూ.. కాళ్లు, చేతులు లేని చిన్నారి జారుడు బ‌ల్ల‌పై జారడానికి మెట్ల‌పై నుంచి ఎక్క‌డాన్ని చూస్తే ఇంత‌క‌న్నా పెద్ద క‌ష్టం ఇంకోటి ఉండ‌ద‌నిపిస్తుంది. చిన్న చిన్న విష‌యాల‌కే మ‌న‌స్తాపం చెందేవారు, జీవితంపై విర‌క్తి చెంది ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకునేవారికి ఈ వీడియో చూపిస్తే ఖ‌చ్చింతంగా స్ఫూర్తిని పోందుతారు. ఎందుకంటే.. బిజినెస్ టైకూన్ ఆనంద్ మ‌హీంద్రా అంత‌టోడే ఈ చిన్నారిని చూసి స్ఫూర్తి పాందాను అంటున్నారు. ఈ వీడియోను ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. జారుడు బ‌ల్ల‌పై జార‌డానికి మెట్ల‌పై ఎక్కుతూ చిన్నారి ప‌డుతున్న క‌ష్టాన్ని చూశాక ఈ దునియాలో ఇంత‌క‌న్నా పెద్ద క‌ష్ట‌ము ఇంకోటి ఉండ‌ద‌ని ఆనంద్ మ‌హీంద్రా అన్నారు. నిజ‌మే క‌దా...

Viral Video


5808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS