ఎనిమిదేళ్ల వేట.. మొత్తానికి ఆ రాక్షస మొసలి చిక్కింది!

Tue,July 10, 2018 02:32 PM

8 years hunt for giant 600 kg Crocodile ends in Australia

సిడ్నీ: అది 600 కిలోల బరువున్న రాక్షస మొసలి. దీనికోసం దాదాపు దశాబ్దకాలంగా వేటాడుతున్నారు. మొత్తానికి అది చిక్కింది. 60 ఏళ్ల వయసు, 4.71 మీటర్ల పొడువు ఉన్న ఈ ఉప్పునీటి మొసలిని పట్టుకున్నట్లు ఆస్ట్రేలియాలోని వైల్డ్‌లైఫ్ రేంజర్స్ చెప్పింది. ఈ ఏడాది మొదటి నుంచి కేథిరన్ నదిలో భారీ ఉప్పునీటి మొసళ్లను పట్టుకున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 3.92, 3.97 మీటర్ల పొడవున్న మొసళ్లు చిక్కాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇలా మొత్తం 188 ఉప్పునీటి మొసళ్లు దొరికినట్లు నార్తర్న్ టెర్రిటరీ ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పుడు దొరికిన మొసలిని 2010లోనే రేంజర్లు గుర్తించారు. దీనికోసం అప్పటి నుంచే వేట మొదలుపెట్టారు. రెండు వారాల కిందట నదిలో ఉచ్చులు ఏర్పాటుచేశారు. దీంతో అది చిక్కింది. దీనికంటే ముందు 2011లో 4.6 మీటర్ల పొడవున్న మొసలి దొరికింది. ఇప్పుడు దొరికిన మొసలిని కేథరిన్ ప్రాంతంలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు.

1815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS